టాలీవుడ్లో ఈ మధ్యకాలంలో కథాబలం ఉన్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అదే కోవలో, స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రంగా మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది 'విశ్వనాథ్ అండ్ సన్స్'. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'విశ్వనాథ్ & సన్స్'. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది.
ఒక అందమైన ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే మన ముందుకు రానుంది. సూర్య తనదైన స్టైలిష్ మరియు మెచ్యూర్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఇక 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు ఈ సినిమాలో కీలక పాత్రలో మెరవబోతోంది. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ మరియు సన్నివేశాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. టీజర్లో చూపించిన లొకేషన్లు మరియు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సార్', లక్కీ భాస్కర్ వంటి విజయాల తర్వాత వెంకీ అట్లూరి మళ్ళీ ఒక బలమైన కథతో వస్తున్నారు.
ఫ్యామిలీ బాండింగ్ మరియు ఎమోషన్స్‌ను డీల్ చేయడంలో ఆయనకున్న ప్రతిభ టీజర్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ ఒక సోల్ లాంటిది. టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటుంటేనే ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నాయి. నలభైలో ఉన్న హీరోకి ఇరవైలో ఉన్న హీరోయిన్ కి మధ్య జరిగే మెచ్యూర్డ్ స్టోరీగా విశ్వనాథ్ &సన్స్ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.