Top story: టీవీలో దేశభక్తి స్పీచ్ లు, నీతులు… జ్యోతిష్యుడి బెడ్ రూమ్ లో బంచిక్… అశోక్ ఖరాత్ డర్టీ పిక్చర్ హీరోయిన్…!

మహిళలకు అన్యాయం జరిగితే సింహంలా గర్జిస్తానన్న నోరు.. ఒక కామాంధుడి ముందు మోకరిల్లిందా..? అబలలకు అండగా ఉండాల్సిన మహిళా కమిషన్ చైర్మన్ పీఠం.. ఒక రేపిస్ట్ పాదపూజకు వేదికైందా..? అవును.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు రూపాలీ చాకంకర్ పేరు వింటేనే జనం

Post Published By: dialnews
Updated : 4 April 2026, 8:45 AM IST

మహిళలకు అన్యాయం జరిగితే సింహంలా గర్జిస్తానన్న నోరు.. ఒక కామాంధుడి ముందు మోకరిల్లిందా..? అబలలకు అండగా ఉండాల్సిన మహిళా కమిషన్ చైర్మన్ పీఠం.. ఒక రేపిస్ట్ పాదపూజకు వేదికైందా..? అవును.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు రూపాలీ చాకంకర్ పేరు వింటేనే జనం ఛీత్కరించుకుంటున్నారు. దేశభక్తురాలిగా, మహిళా బాంధవిగా బిల్డప్ ఇచ్చిన ఈ నేత.. తెర వెనుక నడిపిన అక్రమ సంబంధాల బాగోతం ఇప్పుడు బజారుకెక్కింది. అశోక్ ఖరాత్ అనే కిరాతకుడితో ఆమె సాగించిన రాసలీలలు, ఆర్థిక లావాదేవీలు ఇప్పుడు బయటపడ్డాయి.రూపాలీ చాకంకర్.. ఎన్సీపీ మహిళా అధ్యక్షురాలిగా, మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌గా రాష్ట్రంలో చక్రం తిప్పారు. టీవీ డిబేట్లలో కూర్చుని మహిళా హక్కుల గురించి గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చేవారు. తనను తాను ఒక గొప్ప దేశభక్తురాలిగా, సామాజిక కార్యకర్తగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. కానీ, ఆమె అసలు రూపం ఏంటో ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మహిళలను రక్షించాల్సిన వ్యక్తి.. 58 మంది మహిళల జీవితాలను నాశనం చేసిన ఒక మృగాడికి మద్దతుగా నిలవడం ద్రోహం కాదా అనే ప్రశ్న వినపడుతోంది.

అసలు ఎవరీ అశోక్ ఖరాత్ అంటే..? తనను తాను 'కెప్టెన్' అని పిలుచుకుంటూ, ఆధ్యాత్మిక గురువుగా చలామణి అయ్యేవాడు. జ్యోతిష్యం పేరుతో, సమస్యలు తీరుస్తానంటూ మహిళలను తన ఆశ్రమానికి పిలిపించుకునేవాడు. అక్కడ వారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడం.. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం ఇతగాడి నిత్యకృత్యం. పోలీసుల దర్యాప్తులో ఇతని దగ్గర లభించిన పెన్ డ్రైవ్‌లలో 58 మంది మహిళల అభ్యంతరకర వీడియోలు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. మహిళా కమిషన్ చైర్మన్ హోదాలో ఉన్న రూపాలీ చాకంకర్.. ఈ అశోక్ ఖరాత్ పాదాలకు పూజ చేస్తున్న వీడియోలు, ఆయనకు గొడుగు పడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఒక రేపిస్ట్‌ను దైవ సమానుడిగా పూజించడం వెనుక ఉన్న మర్మమేంటి? కేవలం భక్తేనా.. లేక అంతకు మించిన అక్రమ సంబంధమా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తుంటే.. వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం గురు-శిష్యుల బంధం కాదని, అత్యంత సన్నిహితమైన అక్రమ సంబంధమని స్పష్టమవుతోంది.

ఆరోపణలు రావడమే ఆలస్యం.. రూపాలీ చాకంకర్ తన పదవులకు రాజీనామా చేశారు. మార్చి 20న మహిళా కమిషన్ చైర్మన్ పదవికి, ఆ తర్వాత పార్టీ పదవికి కూడా గుడ్ బై చెప్పారు. తప్పు చేయకపోతే రాజీనామా ఎందుకు చేసినట్లు? SIT విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ఖరాత్ ట్రస్ట్‌లో రూపాలీ కుటుంబ సభ్యులు ఉండటం, వందల కోట్ల ఆర్థిక లావాదేవీలు వీరిద్దరి మధ్య జరగడం చూస్తుంటే.. ఇది కేవలం సెక్స్ స్కాండల్ మాత్రమే కాదు, ఒక భారీ అవినీతి కుంభకోణం అని అర్థమవుతోంది.ఈరోజు రూపాలీ చాకంకర్ తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తనను ఒక మహిళగా టార్గెట్ చేస్తున్నారని ఏడుస్తున్నారు. కానీ, ఆమె వల్ల అన్యాయానికి గురైన ఆ 58 మంది మహిళల కన్నీళ్లకు సమాధానం ఎవరు చెబుతారు? అనే ప్రశ్న వినపడుతోంది. ఒక మహిళ అయి ఉండి.. కామాంధుడికి కాపలాగా ఉండటం ఆమెకు సిగ్గుచేటు. ఆమె చేసిన పాపాలకు పదవి పోవడమే కాదు.. కఠినమైన జైలు శిక్ష పడాలని మహారాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ముసుగు వేసుకున్నంత కాలం ప్రతి ఒక్కరూ నీతి మంతులే. కానీ నిజం బయటపడిన రోజు అసలు రంగు తెలుస్తుంది. రూపాలీ చాకంకర్ ఉదంతం కొందరు రాజకీయ నాయకుల ద్వంద్వ నీతికి నిదర్శనం. ఈ కేసులో విచారణ వేగవంతం కావాలి, బాధితులకు న్యాయం జరగాలి అనే డిమాండ్ లు వినపడుతున్నాయి.

Published : 
  • 4 April 2026, 8:45 AM IST