Top story:ఐటీ కంపెనీలను లేపేస్తాం గూగుల్, మైక్రోసాఫ్ట్ కు ఇరాన్ వార్నింగ్…!

మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ఎక్కడా లొంగడం లేదు. నష్టపోతున్నా సరే ఇరాన్ మాత్రం తన దాడులు కంటిన్యూ చేస్తూనే ఉంది. తాజాగా ఇరాన్ నుంచి వచ్చిన వార్నింగ్ అమెరికన్

Post Published By: dialnews
Updated : 12 March 2026, 2:10 PM IST

మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ఎక్కడా లొంగడం లేదు. నష్టపోతున్నా సరే ఇరాన్ మాత్రం తన దాడులు కంటిన్యూ చేస్తూనే ఉంది. తాజాగా ఇరాన్ నుంచి వచ్చిన వార్నింగ్ అమెరికన్ కార్పోరేట్ కంపెనీలను కంగారు పెడుతోంది. ఇరాన్ కీలక సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాజాగా అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థలకు జారీ చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ వార్నింగ్ చూస్తుంటే ఈ యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా ఇప్పుడు గ్లోబల్ టెక్నాలజీ, ఆర్థిక రంగాలపై రూటు మార్చుకుంటుంది.

తమ దేశ మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా, పశ్చిమాసియాలో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ ఆర్మీ సెన్సేషనల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎన్‌విడియా, ఒరాకిల్ వంటి సంస్థలను ఇరాన్ నేరుగా వార్నింగ్ లు ఇచ్చింది. ఈ కంపెనీలు ఇజ్రాయెల్‌కు సాంకేతిక సహకారం అందిస్తున్నాయని లేదా శత్రువులకు మద్దతుగా ఇస్తున్నాయని ఇరాన్ మండిపడుతోంది.

కేవలం యుద్ధ భూమిలోనే కాకుండా, సైబర్ దాడులు, భౌతిక దాడుల ద్వారా ఐటీ, బ్యాంకింగ్ రంగాలను దెబ్బతీయడమే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా ప్రత్యర్థి దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఇరాన్ ఆర్మీ భావిస్తోంది. ఈ దాడుల తీవ్రత ఎలా ఉండబోతోందో చెబుతూ.. సదరు ఐటీ సంస్థల కార్యాలయాలకు కనీసం ఒక కిలోమీటరు పరిధిలో సామాన్య ప్రజలు ఎవరూ ఉండవద్దని, ఆ ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లాలని ఇరాన్ హెచ్చరించింది. దీనితో అక్కడి నుంచి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఖాళీ చేసి వెళ్ళినట్లుగా తెలుస్తోంది.

మా మౌలిక సదుపాయాలపై దాడులు జరుగుతున్నప్పుడు, మేము చూస్తూ ఊరుకోము. ప్రతిదాడులు చేయడం మా హక్కు, అది సబబే అంటూ ఐఆర్జీసి ప్రకటన చేసింది. దీనివల్ల పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదిరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వార్నింగ్ తో ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల షేర్లు పడిపోయే అవకాశం ఉంది. భౌతిక దాడులతో పాటు భారీ ఎత్తున సైబర్ దాడులు జరిగితే గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది.

అలాగే పశ్చిమాసియా దేశాల్లోని ఐటీ హబ్‌లలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా ఒకవైపు యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే, ఇరాన్ చేస్తున్న ఈ హెచ్చరికలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో సదరు కంపెనీలు తమ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాయి. అటు గల్ఫ్ దేశాల్లోని బ్యాంకులు, ఆర్ధిక రంగ సంస్థలను ఇరాన్ లక్ష్యం చేసుకోవడంతో.. ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలు కూడా తీవ్రంగా దెబ్బ తినే అవకాశం కనపడుతోంది.

Published : 
  • 12 March 2026, 2:10 PM IST