Top story: హర్మూజ్‌లో అడుగు పెడితే ఫినిషేనా… ? అందుకే ట్రంప్‌కు ప్యాంట్‌ తడచిపోయిందా… ?

హర్మూజ్‌లో అడుగుడగునా...నౌకలకు ప్రమాదం పొంచి ఉందా ? అడుగు పెడితే...భారీ షిప్‌లు పేలిపోవడం ఖాయమేనా ? ఇరాన్‌ అనుమతి లేకుండా హర్మూజ్‌ను దాటితే...షిప్‌లతో అందులో ఉన్న వారంతా నీటిలో కలిసిపోవాల్సిందేనా ?

Post Published By: dialnews
Updated : 11 April 2026, 10:42 AM IST

హర్మూజ్‌లో అడుగుడగునా...నౌకలకు ప్రమాదం పొంచి ఉందా ? అడుగు పెడితే...భారీ షిప్‌లు పేలిపోవడం ఖాయమేనా ? ఇరాన్‌ అనుమతి లేకుండా హర్మూజ్‌ను దాటితే...షిప్‌లతో అందులో ఉన్న వారంతా నీటిలో కలిసిపోవాల్సిందేనా ? అమెరికాను దారిలోకి తెచ్చుకోవడానికే ఇరాన్‌ సీమైన్స్‌ అమర్చిందా ? అందుకే డోనాల్డ్‌ ట్రంప్‌కు...ప్యాంట్‌ తడచిపోయిందా ? యుద్దం కొనసాగిస్తే...మరిన్ని కష్టాలు తప్పవనే భయం ట్రంప్‌కు పట్టుకుందా ?ఇరాన్‌ వ్యూహాలు అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 40 రోజుల పాటు సాగిన యుద్దంలో ఇరాన్‌ కొరకకొయ్యలా తయారైంది. అంతుచిక్కని అస్త్రాలతో అమెరికాకు టెహ్రాన్‌ చుక్కలు చూపిస్తోంది. ఇరాన్‌ను దారిలోకి తెచ్చుకోవాలని వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇచ్చారు. ఆ తర్వాత ఖర్గ్‌పై దాడులు చేసినా...ఇరాన్‌ మాత్రం వెనుకడుగు వేయలేదు. మౌలికవసతులు ధ్వంసం చేసినా...టెహ్రాన్‌ బెదరడం లేదు. పైగా ట్రంప్‌పై రివర్స్‌ అటాక్‌ మొదలుపెట్టింది.

హర్మూజ్‌పై పట్టు సాధించాలని ట్రంప్‌ ప్రయత్నిస్తుంటే...దమ్ముంటే అడుగు పెట్టి చూడు...అంటూ సవాల్‌ విసురుతోంది. సముద్రంలో ఒక్క అడుగు వేసినా...సొర చేపలకు సైనికులు ఆహారం అవుతారని హెచ్చరించింది. అంతేకాదు...అడుగుకో సీమైన్స్‌ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా పడవలు హర్మూజ్‌ ప్రయాణిస్తే...భారీ నౌకలు పేల్చి వేస్తామని ట్రంప్‌కు వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ట్రంప్‌కు ప్యాంట్‌ తడిచిపోయినట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌ ఎక్కడెక్కడ సీమైన్స్‌ పెట్టిందో తెలియక...పలు దేశాలు వణికిపోతున్నాయి. భూతల దాడులకు దిగితే...అసలు మోసం వస్తుందనే భయంతో ట్రంప్‌కు పట్టుకుందట. ఇప్పటికే యుద్దంలో వెనుకబడ్డ అమెరికా...అనవసరంగా ఇరాన్‌ను కెలుక్కుంటే...భారీ నష్టం తప్పదనే అంచనాకు వచ్చాడట. యుద్ధ నౌకలకు భారీ డ్యామేజ్‌ జరిగింది. దాదాపు 40 విమానాలను అమెరికా కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్‌ను తలగోక్కోవడం ఎందుకని ట్రంప్‌ అనుకున్నారట. ఈ కారణంగానే యుద్దానికి విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. తాజా పరిణామాలు పరిస్థితిని మళ్లీ సంక్లిష్టంగా మార్చుతున్నాయి. ఇరాన్‌కు చెందిన పలు వార్తా సంస్థలు విడుదల చేసిన చార్ట్‌లు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. ఆ చార్ట్‌ల ప్రకారం, ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డులు హర్మూజ్ జలసంధిలో సముద్ర మైన్లు అమర్చినట్టు తెలుస్తోంది. నౌకాయాన రంగానికి, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది కీలకమైనది. ఎందుకంటే హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో చమురు, సహజ వాయువు రవాణా జరుగుతుంది. గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్‌లో సుమారు 20 శాతం ఈ మార్గం మీదుగా సాగుతుంది. ఇది సాధారణంగా నౌకలు ప్రయాణించే ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్‌పై ఉంది.

ఈ ప్రాంతంలోనే మైన్లు అమర్చినట్టు సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో నౌకలు సాధారణ మార్గాన్ని వదిలి, ఇరాన్ తీరానికి దగ్గరగా, లారక్ దీవి వైపు ఉత్తర దిశగా ప్రయాణించినట్లు యుద్ధ సమయంలో తెలుస్తోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ.. పలు ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. దీంతో కాల్పుల విరమణపై అనిశ్చితి నెలకొంది.కాల్పుల విరమణ ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయి. హర్మూజ్ జలసంధిపై ఇరాన్‌ కొత్త వ్యూహం, కువైట్‌-సౌదీ ఆరోపణలు, ఇరాన్‌ ఖండనలు అన్నీ ఇవన్నీ ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ ప్రాంతంలో పరిస్థితులు ఎలా మారతాయన్నదే ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.

మరోవైపు పూర్తిస్థాయి శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చే వరకు అమెరికా యుద్ధ నౌకలు, బలగాలు ఇరాన్ పరిసర ప్రాంతాల్లోనే కొనసాగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితులపై తీవ్రంగా స్పందించారు. ఒప్పందాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ట్రంప్ తన ప్రకటనలో హర్మూజ్ జలసంధి ఎప్పటికీ తెరిచి ఉంచాలని ఆదేశించారు. ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి.

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని పేర్కొంటూ ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా చర్యలకు దిగడంతో ప్రాంతీయ స్థాయిలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నాయి. ఈ మార్గం లో ఎలాంటి అంతరాయం కలిగినా ఇంధన ధరలు పెరగడం, సరఫరా లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద, కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో శాంతి ఇంకా దూరంగా ఉన్నట్టే కనిపిస్తోంది. ఇరాన్ చర్యలు, అమెరికా హెచ్చరికలు, ప్రాంతీయ సంఘర్షణలు అన్నీ కలిపి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో జరగబోయే చర్చలు ఈ సంక్షోభానికి పరిష్కారం చూపుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తోంది.

Published : 
  • 11 April 2026, 10:42 AM IST