టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా వస్తోందంటే చాలు... మాస్ అభిమానుల్లోను, మూవీ లవర్స్‌లోను ఒక రకమైన పూనకాలు మొదలవుతాయి. ఆయన మార్క్ డైలాగ్స్, క్యారెక్టరైజేషన్లు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న మరో క్రేజీ అండ్ లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘స్లమ్ డాగ్’.కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ప్రకటన వచ్చినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లోను, ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో చిత్ర బృందం రీసెంట్‌గా విడుదల చేసిన ఒక అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది! అలనాటి స్టార్ హీరోయిన్, విలక్షణ నటి టబు ఈ సినిమాలో పోషిస్తున్న పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ అఫీషియల్‌గా విడుదల చేశారు.
పూరి జగన్నాథ్ సినిమాల్లో పాత్రలు ఎప్పుడూ చాలా స్టైలిష్‌గా, అంతే పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇప్పుడు ‘స్లమ్ డాగ్’ లో నటి టబు పాత్రను కూడా ఆయన చాలా వైవిధ్యంగా మలిచినట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో టబు ‘గౌరీ హెగ్డే’ అనే పవర్‌ఫుల్ డిప్యూటీ కమిషనర్ పాత్రను పోషిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన పరిచయ గ్లింప్స్ వీడియోలో టబు లుక్ చాలా సీరియస్‌గా, గంభీరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ వీడియోలో ఆమె చెప్పిన ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది."ముందు కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం!" అనే సింగిల్ డైలాగ్‌తోనే టబు క్యారెక్టర్ ఏ స్థాయిలో రచ్చ చేయబోతోందో పూరి స్పష్టమైన హింట్ ఇచ్చేశారు.
ఒక పోలీస్ అధికారిణిగా టబు నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె కెరీర్‌లో ఇది మరో మరపురాని పవర్ ఫుల్ క్యారెక్టర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.విజయ్ సేతుపతి వంటి అద్భుతమైన వర్సటైల్ నటుడితో పాటు, టబు వంటి వర్సటైల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తోడవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
సాధారణంగా పూరి హీరో క్యారెక్టర్‌ను ఏ స్థాయిలో ఎలివేట్ చేస్తారో, విలన్ లేదా సపోర్టింగ్ క్యారెక్టర్లను కూడా అంతే స్ట్రాంగ్‌గా డిజైన్ చేస్తారు. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండటంతో... సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'స్లమ్ డాగ్' చిత్రంపై హైప్‌ను పెంచడంలో ఈ గ్లింప్స్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని సినిమాపై సినీ విశ్లేషకులు సైతం గట్టి నమ్మకంతో ఉన్నారు.