Top story: మంగ్లీ కేసులో ఏదీ నిజం ? మధునాయక్‌ వీడియోతో కొత్త ట్విస్ట్‌…!

సింగర్ మంగ్లీ కేసులో...రోజుకో ట్విస్ట్‌ వెలుగులోకి వస్తోంది. కొత్త తెరపైకి వచ్చిన మధునాయక్‌...సుబ్బారావు చెప్పేవన్నీ అబద్దాలంటున్నారు. ఈ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ వాదిస్తోంది. అడ్వకేట్‌ సుబ్బారావు మాత్రం మంగ్లీ

Post Published By: dialnews
Updated : 18 April 2026, 10:34 AM IST

సింగర్ మంగ్లీ కేసులో...రోజుకో ట్విస్ట్‌ వెలుగులోకి వస్తోంది. కొత్త తెరపైకి వచ్చిన మధునాయక్‌...సుబ్బారావు చెప్పేవన్నీ అబద్దాలంటున్నారు. ఈ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ వాదిస్తోంది. అడ్వకేట్‌ సుబ్బారావు మాత్రం మంగ్లీ, మంగ్లీ సోదరుడు శివలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగ్లీ పేరు చెప్పడం వల్ల పెట్టుబడి పెట్టినట్లు బాధితులు వాపోతున్నారు. చేయని తప్పుకు తనను సమాజం ముందు దోషిగా నిలబెట్టడం ఎంతవరకు న్యాయమని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు.సింగర్ మంగ్లీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. కొత్తగా తెరపైకి మధునాయక్‌ పేరు తెరపైకి వచ్చింది. మధునాయక్...మంగ్లీ పేరు వినిపించడం వల్లే తాము నమ్మి పెట్టుబడులు పెట్టామని బాధితులు చెప్తున్నారు. అయితే పరారీలో ఉన్న రమావత్ మధు తాజాగా వీడియో విడుదల చేయడం కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ఆ వీడియోలో అడ్వకేట్ సుబ్బారావు చెప్పిన ఆరోపణలు వాస్తవాలు కావని స్పష్టం చేశారు. తాను కూడా మోసపోయానని...హిమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి కంపెనీ డబ్బులను తన దగ్గరే ఉంచుకున్నాడని ఆరోపించాడు.

ఆ డబ్బులు బినామీల వద్ద ఉన్నాయని, వాటిని తిరిగి తీసుకుని బాధితులకు ఇవ్వాలని కోరాడు. అడ్వకేట్ తన దగ్గర డబ్బులు డిమాండ్ చేశాడని, సెలబ్రిటీల ఫొటోలు, ఫోన్ నంబర్లు సేకరించి వేరే రీతిలో డబ్బులు వసూలు చేయాలనుకున్నాడని కూడా ఆరోపించాడు. అయితే ఇది ఒక పెట్టుబడి స్కీమ్ మాత్రమే కాదు... రియల్ ఎస్టేట్, ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్, ట్రేడింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పి అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపించి డబ్బులు కాజేశారు. గోకులనందన ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌ అనే పేరుతో ఈ కార్యకలాపాలు నిర్వహించారు. మొదట కొంతమందికి రిటర్న్స్ ఇచ్చి నమ్మకంగా నటించారు. పెట్టుబడి పెట్టిన దాని కంటే ఎక్కువ డబ్బుకు వస్తుండటంతో చాలా మంది డబ్బులు పెట్టడానికి ముందుకు వచ్చారు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించారు మధు, మంగ్లీ సోదరుడు శివ. మొత్తంగా వందల మంది నుంచి 100 నుంచి 150 కోట్ల వరకు కాజేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మైక్రో ఫైనాన్స్ పేరుతో జరిగిన ఈ చీటింగ్ వ్యవహారంలో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. మధు నాయక్ అనే వ్యక్తిని ఒక సామాజిక కార్యక్రమంలో కలిసిన మాట వాస్తవమేనని అంగీకించారు. అయితే అతని వ్యాపార లావాదేవీల గురించి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ వ్యవహారం తెలిసిన తర్వాత బాధితులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో...అడ్వకేట్ సుబ్బారావుతో కలిసి వెళ్లి మధు నాయక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో అసలు నిందితులను వదిలేసి, కొందరు వ్యక్తులు కేవలం తనను టార్గెట్ చేస్తున్నారని మంగ్లీ ఆరోపించారు. హేమకాంత్ రెడ్డి, అడ్వకేట్ సుబ్బు, మధు నాయక్ వంటి పేర్లను ప్రస్తావించారు. వీరంతా కావాలనే తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అమాయక ప్రజలు తమ కష్టార్జితాన్ని, డబ్బును పోగొట్టుకున్నారని మంగ్లీ తెలిపారు. తాను జీవితకాల కష్టంతో సంపాదించుకున్న పేరును, పరువును పోగొట్టుకుంటున్నట్లు వాపోయారు. ఈ కేసులో తాను కూడా ఒక బాధితురాలినే అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చేయని తప్పుకు తనను సమాజం ముందు దోషిగా నిలబెట్టడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు.

కొన్ని రోజుల క్రితం అడ్వకేట్ సింగపోగు సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగర్‌ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంగ్లీ తోపాటు... ఆమె సోదరుడు శివ, మరో ముగ్గురిపై బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసులు నమోదయ్యాయి. రమావత్ మధునాయక్‌ అనే వ్యక్తి...మంగ్లీ పేరును ఉపయోగించి గోకుల్ నందన ఇన్‌ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించాడు. పెట్టుబడులకు నెలకు 4–5 శాతం వడ్డీ, స్థలాల రిజిస్ట్రేషన్ వంటి హామీలతో ప్రజల నుంచి 100 నుంచి 150 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఆరోపించాడు. ఈ వ్యవహారంలో తానే వ్యక్తిగతంగా దాదాపు 10 కోట్ల వరకు మోసపోయానని సుబ్బారావు ఫిర్యాదు పేర్కొన్నారు. డబ్బులు తిరిగి అడిగితే బెదిరింపులకు దిగారని వాపోయాడు.

కాలం గడిచినా పెట్టుబడిదారులకు లాభాలు ఇవ్వలేదని...అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని బాధితుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే మంగ్లీ, ఆమె సోదరుడు ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించాడు. తనను యాక్సిడెంట్ చేసి చంపేస్తామని బెదిరించారని అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు పంజాగుట్ట పోలీసులకు చెప్పాడు. ఈ కేసులో కీలక నిందితులుగా రమావత్ మధు, బాలాజీనాయక్, భరత్ చౌహాన్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిపై నల్గొండ, గద్వాల్ జిల్లాల్లో మొత్తం 62 కేసులు నమోదయ్యాయి. పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైనట్టు ఆరోపణలు ఉన్నాయి.

Published : 
  • 18 April 2026, 10:34 AM IST