ప్రాంతీయ పార్టీలకు ఢిల్లీ స్థాయిలో ఏదోక సపోర్ట్ ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గల్లీలో నువ్వెంత తోపు అయినా ఢిల్లీలో ఓ సపోర్ట్ ఉండాలి. అంటే గాడ్ ఫాదర్ లెక్క ఓ సపోర్ట్ చాలా ముఖ్యం. ఈ విషయంలో ఎన్నో లోకల్ పార్టీలు ఓ ప్లానింగ్ తో ఉంటాయి. తెలంగాణా మాజీ సిఎం కేసీఆర్ కు ఢిల్లీలో ఓ సపోర్ట్ ఉండేది. మాజీ గవర్నర్ నరసింహన్.. తెలంగాణా రాజ్ భవన్ లో ఉన్న సమయంలో ఢిల్లీలో కేసీఆర్ కు ఏ ఇబ్బందులు ఉండేవి కాదు. ఇక ఏపీలో కూడా వైఎస్ జగన్ కు అలాంటి సపోర్ట్ ఢిల్లీలో ఉండేది.
వైసిపి మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రూపంలో పెద్ద అండ ఉండేది అనే కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినపదేవి. కానీ.. రాజకీయాలకు ముఖ్యంగా వైసిపికి దూరమైన తర్వాత ఢిల్లీలో వైసీపీకి ఇబ్బందికర పరిస్తితులు నడుస్తున్న మాట వాస్తవం. అక్కడి నుంచే జగన్ కు ఢిల్లీ లెవెల్ లో సీన్ రివర్స్ అయిపొయింది. 2019కి ముందు వైసీపీకి ఢిల్లీలో విజయసాయిరెడ్డి నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ ఉండేది. బిజెపికి.. టీడీపీని దూరం చేయడంలో కూడా విజయసాయి రెడ్డి ఢిల్లీ లెవెల్ సక్సెస్ అయి.. ఏపీలో గేమ్ ఆడారు.
దాని ఫలితమే.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ జగన్.. ముఖ్యమంత్రి అయ్యారు అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు పదేపదే చెప్తూ ఉంటారు. అయితే 2019 తర్వాత క్రమంగా వైసీపీలో.. విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గిందనే కామెంట్ కూడా వినిపించింది. చివరకు 2024లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అదేవిధంగా తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. అక్కడి వరకు బాగానే ఉంది.
కానీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో లేకపోవడం కారణంగా జగన్ తెలియకుండా సఫర్ అవుతున్నారు. న్యాయపరమైన చిక్కులు, పార్లమెంట్ లెవెల్ లో సపోర్ట్ అనేది కరువైంది. ఎంపీలు ఉన్నా సరే.. ఢిల్లీ లెవెల్ లో ఎఫెక్ట్ చూపే నాయకులు కాదు వాళ్ళు. అందుకే జగన్ ఎంతో సఫర్ అవుతున్నారు అనే కామెంట్స్ రిపీటేడ్ గా వస్తున్నాయి. ఇక అప్పట్లో జగన్ ను వ్యక్తిగతంగా సేవ్ చేసేందుకు, పొలిటికల్ గా బలోపేతం చేసేందుకు.. ఢిల్లీలో విజయసాయిరెడ్డి అన్ని పార్టీల నాయకులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకునే వారు.
పదేపదే ఎంపీలకు లంచ్ లు, డిన్నర్ లు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసేవారు. కేంద్ర ప్రభుత్వం.. ఎంపీలకు కేటాయించే నివాసాన్ని.. సొంత ఖర్చులతో విజయసాయిరెడ్డి రేనోవేషన్ కూడా చేసుకున్నారు. అప్పట్లో ఇది ఢిల్లీలో హాట్ టాపిక్ అయింది. ఇక విజయసాయిరెడ్డి దూరమైన తర్వాత.. ఢిల్లీలో ఆ పాత్ర ఎవరు పోషిస్తారు అనే దానిపై వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోయిన తర్వాత.. కూటమి తరుపున టీడీపీ, జనసేన ఢిల్లీలో బలంగా ఉన్నాయి. ఈ బలం.. తెలంగాణా ప్రభుత్వానికి కూడా హెల్ప్ అవుతోంది.
మరి జగన్ కు ఢిల్లీలో హెల్ప్ చేసే లీడర్ ఎవరు అనే ప్రశ్నలు.. ఉత్పన్నమవుతున్న టైంలో.. ఇప్పుడు ఈ సమయంలో.. ఓ మాజీ రాజ్యసభ ఎంపీకి జగన్ గాలం వేసినట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. బిజెపి మాజీ రాజ్యసభ ఎంపీ, లాయర్ సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీలో జగన్ కు అండగా నిలబడుతున్నారు అనే కామెంట్ వినపడుతోంది. ఇటీవల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సుబ్రహ్మణ్యస్వామి వేసిన ఓ పిటీషన్ కూడా సంచలనమైంది.ఇక ఇప్పుడు జగన్ ను ఎలాగైనా సరే బీజేపీ పెద్దలకు.. మరోసారి దగ్గర చేసేందుకు సుబ్రమణ్య స్వామి తీవ్రంగా కష్టపడుతున్నారని టాక్.
బిజెపికి విజయసాయి రెడ్డి దగ్గర కావడంలో నరసింహన్ ఎంత హెల్ప్ చేసారో.. సుబ్రహ్మణ్య స్వామి కూడా అదే స్థాయిలో సపోర్ట్ ఇచ్చారని అంటూ ఉంటారు. పొలిటికల్ సర్కిల్స్ లో.. సుబ్రమణ్య స్వామికి మంచి ఇమేజ్ ఉంది. దీనిని జగన్ వాడుకునేందుకు.. ఢిల్లీ లెవెల్ లో ప్లాన్ చేసినట్లు సమాచారం. సుబ్రమణ్య స్వామి పార్టీ మారే అవకాశం లేదు. ఆయన బిజెపిలో ఉంటూనే.. జగన్ ను కేంద్ర పెద్దలకు దగ్గర చేసేందుకు.. ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారనే మాట వినపడుతోంది.
ఈ టైంలో జగన్ ను ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించే ట్రయల్స్ కూడా సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నారు. త్వరలోనే అమిత్ షాతో కూడా అవసరమైతే జగన్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ, ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో న్యూస్ వైరల్ అవుతుంది. న్యాయ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలపై సుబ్రమణ్య స్వామికి పట్టు ఎక్కువ. ఇతర పార్టీలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని టాక్. విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలో.. సుబ్రహ్మణ్య స్వామిని జగన్ కు దగ్గర చేయడంలో.. సక్సెస్ అయ్యారు. విజయసాయి రెడ్డి ఎలాగో దూరంగా ఉండటంతో సుబ్రమణ్య స్వామి.. జగన్ కోసం తాను చేయాల్సినవన్ని చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది.