Top story: సౌదీ కోసం రంగంలోకి పాకిస్తాన్, టర్కీ కూటమి సౌదీకి మద్దతుగా నిలిచిన పాక్ ఆర్మీ..? ఇరాన్ టార్గెట్ గా సరికొత్త అంతర్జాతీయ వ్యూహం..?
పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ముస్లిం ప్రపంచం అత్యంత పవిత్రంగా భావించే మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతు గల హూతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడికి తెగబడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.