Top Story: పినరయి విజయన్‌ కూతురు అరెస్ట్‌ ?

రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే.. అధికారంలో ఉన్నప్పుడు నేతలు ఎంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తారో అధికారం పోయాక అంతే వీక్‌గా మారిపోతారు

Post Published By: dialnews
Updated : 28 May 2026, 10:08 AM IST

రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే.. అధికారంలో ఉన్నప్పుడు నేతలు ఎంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తారో అధికారం పోయాక అంతే వీక్‌గా మారిపోతారు. పాత కష్టాలన్నీ కట్టగట్టుకుని చుట్టుముట్టేస్తాయి. ఇప్పుడు కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌ ఇంట్లో కూడా ఇదే సీన్‌ కనిపిస్తోంది. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన కొద్ది రోజులకే.. ఆయన కూతురు వీణా విజయన్‌కు చెందిన ఐటీ కంపెనీ 'ఎక్సాలాజిక్ సొల్యూషన్స్' లావాదేవీలపై ఈడీ అధికారులు. ఈ వ్యవహారంలో వీణ విజయన్‌ అరెస్ట్‌ అయ్యే ఛాన్స్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.పినరయి విజయన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కూతురు ఎప్పుడు పెద్దగా కెమెరా ముందుకు రాలేదు.

రాజకీయంగా అసలు ఎలాంటి యాక్టివిటీ లేదు. కానీ అలాంటి వ్యక్తిపై విజయన్‌ అధికారం కోల్పోయిన కొన్ని రోజుల్లోనే ఈడీ రైడ్స్‌ జరగడం ఇప్పుడు కేరళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వీణా విజయన్‌కు చెందిన ఐటీ కంపెనీకి, కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అనే మైనింగ్ కంపెనీకి మధ్య జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలే ఈ దాడులకు ప్రధాన కారణం. 2017 నుంచి 2021 మధ్య కాలంలో CMRL నుంచి వీణ కంపెనీకి సుమారు కోటి 72 లక్షలు వచ్చాయి. అయితే, వీణ కంపెనీ ఆ మైనింగ్ సంస్థకు ఎలాంటి సేవలు అందించకుండానే ఈ డబ్బులు తీసుకుందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇవి ఐటీ సేవల ముసుగులో పినరయి విజయన్‌కు ఇచ్చిన రాజకీయ ముడుపులు అని, దీని వెనుక పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానిస్తోంది.

అయితే ఈ కేసు ఇప్పుడు అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. 2023 ఆగస్టులో ఇన్‌కమ్ ట్యాక్స్ సెటిల్‌మెంట్ బోర్డు ఈ అనుమానాస్పద లావాదేవీలను మొదటిసారిగా బయటపెట్టింది. ఆ తర్వాత 2024లో కార్పొరేట్ మోసాలను దర్యాప్తు చేసే 'సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్' SFIO రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టింది. ఆ వెంటనే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈడీ సీన్‌లోకి ఎంటర్‌ అయిన తరువాత ఈ వ్యవహారంపై వీణ విజయన్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఈడీ విచారణ ఆపాలంటూ పిటిషన్‌ వేశారు. కానీ రీసెంట్‌గా మే 26న ఈడీ విచారణను ఆపాలంటూ వేసిన పిటిషన్‌ను కేరళం హైకోర్టు కొట్టివేయడంతో.. అధికారులకు లైన్ క్లియర్ అయింది. దీంతో వీణ విజయన్‌, పినరయి విజయన్‌తో పాటు వాళ్ల కుటుంబానికి చెందిన 12 ప్రాంతాల్లో ఏకకాలంలో రైడ్స్‌ నిర్వహించారు ఈడీ అధికారులు.ఈడీ దాడుల్లో అధికారులు ప్రధానంగా కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలపైనే దృష్టి పెట్టారు.

వీణా విజయన్ ఐటీ కంపెనీ 'ఎక్సాలాజిక్' మరియు 'సీఎంఆర్ఎల్' సంస్థల మధ్య జరిగిన ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అకౌంటింగ్ రికార్డులు, బ్యాంకు స్టేట్‌మెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే సోదాలు జరిగిన ఇళ్లు, ఐటీ కార్యాలయాల నుంచి పలు లాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేసి తదుపరి విచారణ కోసం తమ వెంట తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్‌లోనే విజయన్‌ అనుచరులు కమ్యూనిస్ట్‌ కార్యకర్తలు భారీ స్థాయిలో చేరుకున్నారు. సోదాలు నిర్వహించేందుకు వచ్చిన అధికారుల వాహనాలపై దాడి చేసి ఇన్నోవా కారును ధ్వంసం చేశారు.తన కూతురు ఎలాంటి అవినీతి చేయలేదని పినరయి విజయన్ మొదటి నుంచీ గట్టిగా చెబుతున్నారు.

ఆ రెండు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం పూర్తిగా చట్టబద్ధమైనదని, లావాదేవీలన్నీ బ్యాంకు ఖాతాల ద్వారా పారదర్శకంగా జరిగాయని, వాటికి ట్యాక్స్‌లు కూడా కట్టారని సమర్థించుకుంటున్నారు. విజయన్‌ కామెంట్స్‌ ఎలా ఉన్నా ఈ కేసులో వీణ విజయన్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెపై కార్పొరేట్ మోసాల చట్టం కింద, అలాగే అత్యంత కఠినమైన 'ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్' PMLA కింద కేసులు నమోదు అయ్యాయి. పీఎంఎల్‌ఏ చట్టం కింద ఈడీకి నిందితులను అరెస్ట్ చేసే విశేషాధికారాలు ఉంటాయి. కాబట్టి, ఈ సోదాల్లో బలమైన ఆధారాలు దొరికితే ఆమె అరెస్ట్‌ అవ్వడం ఖాయం.

 

Published : 
  • 28 May 2026, 10:08 AM IST