అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్.. ఇది ఇప్పుడు కేవలం రెండు దేశాల గొడవ కాదు. అగ్రరాజ్యం ఇరాన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటిస్తే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఊరుకుంటారా..? 'మా మిత్రదేశం జోలికి వస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి' అని రష్యా ఇప్పటికే హెచ్చరించింది. ఒకవేళ రష్యా ఈ యుద్ధంలోకి నేరుగా దిగితే.. అది అమెరికా వినాశనానికి దారితీస్తుందా..? అసలు పుతిన్ మాస్టర్ ప్లాన్ ఏంటి..? ఈ వీడియోలో, ప్రపంచాన్ని వణికించే ఆ భయంకరమైన యుద్ధ సమీకరణాలను ఓ లుక్ వేద్దాం.అసలు ఇరాన్ కోసం రష్యా ఎందుకు అంతలా ఆరాటపడుతోంది..? 2025లో రష్యా-ఇరాన్ మధ్య ఒక 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం' జరిగింది. ఇది కేవలం కాగితం మీద సంతకం కాదు.. ఒకరిపై దాడి జరిగితే మరొకరు అండగా ఉంటామనే బలమైన సంకేతం. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఇరాన్ వేల సంఖ్యలో డ్రోన్లు సరఫరా చేసింది. ఇప్పుడు ఇరాన్ కష్టాల్లో ఉంటే, రష్యా తన 'రుణం' తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇరాన్ పడిపోతే, మధ్యప్రాచ్యంలో రష్యాకు పట్టు పోతుంది.. అందుకే పుతిన్ ఇరాన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోరు.
రష్యా నేరుగా సైన్యాన్ని పంపకపోయినా, అమెరికాకు చుక్కలు చూపించగలదు. అది ఎలా అంటే.. శాటిలైట్ డేటా ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. అమెరికా యుద్ధ విమానాలు, నౌకలు ఎక్కడ ఉన్నాయో రష్యా తన శాటిలైట్ల ద్వారా ఇరాన్‌కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోంది. రష్యా తన S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ మరియు సుఖోయ్-35 యుద్ధ విమానాలను ఇరాన్‌కు అందిస్తే, అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇరాన్ గగనతలంలోకి వెళ్లడం అసాధ్యం. ఇరాన్ దగ్గర ఉన్న హైపర్ సోనిక్ మిస్సైళ్ల వెనుక రష్యా హస్తం ఉందని అమెరికా గట్టిగా నమ్ముతోంది.రష్యా తన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఎస్-400 ట్రియంఫ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఇరాన్ అణు కేంద్రాల వద్ద మోహరిస్తే.. అమెరికాకు చెందిన ఎఫ్-35 స్టీల్త్ విమానాలు కూడా ఆ గగనతలంలోకి వెళ్లలేవు. దీనికి తోడు రష్యా ఇచ్చే SU-35 యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలాన్ని ఇనుప కవచంలా మారుస్తాయి. అంటే అమెరికాకు ఉన్న 'వైమానిక ఆధిపత్యం' రష్యా దెబ్బతీస్తుంది. రష్యాకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ ఉంది. అమెరికా క్షిపణులు, డ్రోన్ల సిగ్నల్స్‌ను జామ్ చేయడం లేదా వాటిని దారి మళ్లించడం ద్వారా అమెరికా దాడులను రష్యా నిర్వీర్యం చేయగలదు.
ఇలాంటి టైంలో అమెరికా కమ్యూనికేషన్ వ్యవస్థను రష్యా బ్లాక్ చేస్తే, అది అమెరికాకు పెద్ద షాక్ అవుతుంది. ఇక్కడ ఇంకో కీలక పాయింట్ ఏంటీ అంటే.. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా అందించిన ఆయుధాల వల్ల రష్యా వేల సంఖ్యలో సైనికులను కోల్పోయింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం పుతిన్‌కు ఒక బంగారు అవకాశం. అమెరికాను నేరుగా కొట్టకుండా, ఇరాన్ ద్వారా అమెరికాను 'డ్రైన్' అంటే ఆర్ధికంగా, సైనికంగా నాశనం చేయాలని రష్యా చూస్తోంది. ఉక్రెయిన్‌లో అమెరికా చేసిన పనిని, ఇప్పుడు ఇరాన్లో రష్యా రిపీట్ చేస్తుంది. ఇది అమెరికాకు పుతిన్ ఇచ్చే 'రిటర్న్ గిఫ్ట్'.ఇరాన్ మీడియాలో వస్తున్న ఒక సంచలన వార్త ఏంటంటే.. ఒకవేళ అమెరికా గనుక ఇరాన్ గడ్డపై అడుగు పెడితే, రష్యాకు చెందిన అత్యంత ప్రమాదకరమైన 'చెచెన్' కమెండోలు ఇరాన్ తరపున పోరాడటానికి సిద్ధంగా ఉన్నారట. రష్యా తన అధికారిక సైన్యాన్ని పంపకుండా, 'ప్రైవేట్ మిలిటరీ' లేదా 'చెచెన్ వాలంటీర్లను' పంపే అవకాశం ఉంది. వీరు గెరిల్లా యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన వారు. అమెరికా సైన్యం ఇరాన్ లోపలికి అడుగు పెడితే, వీరితో పోరాడటం అమెరికాకు అసాధ్యం. పుతిన్ కు అత్యంత సన్నిహితుడైన రంజాన్ కదిరోవ్ తన దళాలను స్టాండ్బైలో ఉంచినట్లు సమాచారం.
ఇది జరిగితే, అమెరికా సైనికులకు ఇరాన్ గడ్డ ఒక నరకప్రాయంగా మారుతుంది. ఉక్రెయిన్‌లో రష్యాను దెబ్బతీసిన అమెరికాపై రివెంజ్ తీర్చుకోవడానికి ఇరాన్ ఒక సరైన వేదిక అని పుతిన్ భావిస్తున్నారు. రష్యాతో పాటు చైనా కూడా ఇరాన్‌కు అండగా నిలబడితే, అది అమెరికాకు కోలుకోలేని దెబ్బ. రష్యా చమురు, చైనా మార్కెట్, ఇరాన్ భౌగోళిక స్థానం.. ఈ మూడు కలిస్తే అమెరికా డాలర్ సామ్రాజ్యం కుప్పకూలుతుంది. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ నుంచి వార్నింగ్ వచ్చింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే, అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని...అంటే, ఇది కేవలం బాంబుల యుద్ధం కాదు.. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను పాతాళానికి తొక్కే యుద్ధం. చివరిగా.. రష్యా నేరుగా యుద్ధంలోకి దిగడం అంటే 'న్యూక్లియర్ వార్' కి తలుపులు తీయడమే. పుతిన్ తన చేతిలో ఉన్న అణు బాంబుల బటన్‌ను వాడతారా..? లేక తెర వెనుక ఉండి అమెరికాను ముప్పుతిప్పలు పెడతారా..? ఏది ఏమైనా, ఇరాన్ మీద పూర్తిస్థాయి దాడి జరిగితే రష్యా మౌనంగా ఉండదు. మూడో ప్రపంచ యుద్ధానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్లే.