ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా ఎక్కడ చూసినా ఒకటే టెన్షన్. ఇరాన్ మరియు అమెరికా దేశాల మధ్య నడుస్తున్న యుద్ధ వాతావరణం, మిడిల్ ఈస్ట్‌లో నిత్యం కురుస్తున్న మిస్సైళ్ల వర్షం చూసి.. ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో అని అందరూ భయపడ్డారు. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోయాయి. కానీ.. సరిగ్గా ఇలాంటి తీవ్ర ఉత్కంఠ భరితమైన పరిస్థితుల మధ్య, ఇప్పుడు ప్రపంచాన్నంతటినీ ఆశ్చర్యపరిచే ఒక సంచలన బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.అవును.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అంతర్జాతీయ సమాజానికి ఒక పెద్ద షాకింగ్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. "మాకు అణు ఆయుధాలు తయారు చేయాలనే ఆలోచన లేదు.. ప్రపంచానికి ఆ నమ్మకాన్ని కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అంటూ ఆయన ప్రకటించారు. అసలు యుద్ధం పీక్స్‌లో ఉన్న సమయంలో ఇరాన్ ఇంతలా ఎందుకు తగ్గింది..? అమెరికాతో వెనుక సీక్రెట్ చర్చలు ఏమైనా జరుగుతున్నాయా..? తెర వెనుక డొనాల్డ్ ట్రంప్ నడిపిన మాస్టర్ ప్లాన్ ఏంటి..? ఈ 60 రోజుల సీజ్ఫైర్ ఒప్పందం ఏంటి..?
యాంకర్ వాయిస్: అసలు మ్యాటర్‌లోకి వెళ్తే.. ఇరాన్ అధికారిక మీడియా సంస్థల సమాచారం ప్రకారం, ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి, అమెరికాతో జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. ఆయన ఏమన్నారంటే.. "మాకు అణు ఆయుధాలు కావాలని లేదు. ఈ ప్రాంతంలో ఎలాంటి అశాంతిని సృష్టించాలని కూడా మేము అనుకోవడం లేదు.మా అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైన అవసరాల కోసమేనని ప్రపంచానికి స్పష్టం చేయడానికి, అవసరమైన హామీలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం." అని చెప్పారు. అంతేకాదు.. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధానికి, అశాంతికి ఇరాన్ కారణం కాదని.. ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ యుద్ధ వాతావరణాన్ని సజీవంగా ఉంచుతున్న ఇజ్రాయెల్ వైఖరి వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇరాన్ చర్చలకు సిద్ధమే అయినప్పటికీ, దేశ గౌరవ మర్యాదల విషయంలో తమ దేశ రాయబారులు ఎక్కడా రాజీ పడబోరని పెజెష్కియాన్ స్పష్టం చేశారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇంత ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక చాలా పెద్ద కథే నడుస్తోంది. అంతర్జాతీయ మీడియా సంస్థ 'ఆక్సియోస్' కథనం ప్రకారం.. అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం దాదాపు చివరి దశకు వచ్చేసింది. అవును.. ఇరు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించేలా ఒక ఒప్పంద ముసాయిదా సిద్ధమైంది. అమెరికాకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఒప్పందం గనుక కుదిరితే, ప్రస్తుతం మూసుకుపోయిన అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' జలసంధిని వెంటనే తెరుస్తారు.దీనివల్ల ఇరాన్ మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లో తన ముడి చమురు అమ్ముకోవడానికి వీలవుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ సప్లై పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల ఒత్తిడి తగ్గుతుంది. అంటే మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక ప్రకటన చాలా త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉందని అమెరికా వర్గాలు లీక్ ఇచ్చాయి. అయితే అమెరికా ఊరికే ఇరాన్‌కు ఈ ఉపశమనం కలిగించడం లేదు. దీని వెనుక ఒక కఠినమైన డిప్లొమాటిక్ ప్లాన్ ఉంది.
దాన్నే "రిలీఫ్ ఫర్ పర్ఫార్మెన్స్" అని పిలుస్తున్నారు. అంటే.. ఇరాన్ మాట మీద నిలబడి తన అణు కార్యక్రమాలను ఆపే కొద్దీ.. అమెరికా ఆ దేశంపై ఉన్న ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తేస్తుంది. ఈ డీల్ ప్రకారం.. వచ్చే 60 రోజుల విండోలో ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయడం లేదా నిర్వీర్యం చేయడంపై చర్చలు జరపాలి. ఇరాన్ మొదటి నుంచీ నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ కి లోబడే తమ అణు విద్యుత్, వైద్య, శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని చెప్తున్నప్పటికీ.. అమెరికా, దాని మిత్రదేశాలు మాత్రం ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందని అనుమానిస్తూ వచ్చాయి.ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు మధ్యవర్తులు నడిపిన దౌత్య నీతి వల్ల ఇరాన్ ఒక మెట్టు దిగి వచ్చి.. అణు ఆయుధాలు వద్దనే స్థాయికి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ డీల్ గనుక సక్సెస్ అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ ప్రభుత్వానికి ఇది ఒక అతిపెద్ద దౌత్య విజయంగా నిలుస్తుంది. ఒకవేళ ఈ శాంతి ఒప్పందం నిజమైతే.. ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలకు చాలా పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఇరాన్ - అమెరికా యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దాంతో ఇండియాలో కూడా చమురు కంపెనీలు రేట్లు పెంచాల్సి వచ్చింది. ఈ ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్ స్థిరపడితే, ద్రవ్యోల్బణం తగ్గి నిత్యావసరాల ధరలు అదుపులోకి వస్తాయి. అంతేకాదు, యుద్ధ భయాల వల్ల విపరీతంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరల్లో కూడా కొంత స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పడతాయి.