Top Story: హోం మంత్రి గారి యాటిట్యూడ్ మారాల్సిందేనా..? మేడం గారి స్పీడుకు బ్రేకులు వెయ్యాల్సిందేనా..?

రాజకీయాల్లో విమర్శలు సహజమే.. కానీ ఆ విమర్శలు చేసే విషయంలో “కంట్రోల్” అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రాజకీయ ప్రత్యర్థులకు రెస్పెక్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్.

Post Published By: dialnews
Updated : 20 February 2026, 8:53 AM IST

రాజకీయాల్లో విమర్శలు సహజమే.. కానీ ఆ విమర్శలు చేసే విషయంలో “కంట్రోల్” అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రాజకీయ ప్రత్యర్థులకు రెస్పెక్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. లేదంటే సిల్లీ పొలిటీషియన్ గా హిస్టరీలో మిగిలిపోవడం ఖాయం. ఈ ఫ్యాక్టర్స్ గురించి తెలియక ఎందరో రాజకీయ నాయకులు 2019 నుంచి 2024 వరకు రెచ్చిపోయారు. “సర్వ దూలానం నోటి దూల ప్రధానం” అనే సామెత రాజకీయాల్లో బాగా వర్తిస్తుంది. అది తెలియని.. నేతలు.. 2024 ఎన్నికల్లో దాని ఫలితాన్ని కూడా చూసినటువంటి పరిస్థితి.

పాలిటిక్స్ లో సెల్ఫ్ కంట్రోల్ మిస్ అయినప్పుడు.. ప్రజా సేవలో లాంగ్ టర్మ్ ఉండటం సాధ్యం అయ్యే పని కాదు. దీనికి ఎందరో “ఎక్స్” లు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని, గన్నవరం నియోజకవర్గ నుంచి వల్లభనేని వంశీ మోహన్, హిందూపురం పార్లమెంట్ నుంచి.. గోరంట్ల మాధవ్, నగిరి నియోజకవర్గం నుంచి ఆర్కే రోజా.. వంటి వారు ఇలాగే నోటితో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సమస్యలు, కేసులు నోటితోనే తెచ్చుకున్నారు. తమ పార్టీ హైకమాండ్ నుంచి కోపరేషన్ ఉండటంతో.. వాళ్ళు ఏది మాట్లాడినా చెల్లిన పరిస్థితి.

ఇప్పుడు ఏపీలో అధికార టిడిపిలో కూడా అటువంటి వాతావరణం కనబడుతుందని.. ఆ పార్టీ క్యాడర్ ఫైర్ మీద ఉన్నారు. ముఖ్యంగా పాయకరావుపేట ఎమ్మెల్యే, హోం మంత్రి అనిత విషయంలో.. ఈ విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. సాధారణంగా దూకుడు స్వభావం కలిగిన హోం మంత్రి మేడం.. 2024లో ఆ పదవికి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నుంచి మేడం గారి ఆటిట్యూడ్ లో గాని.. మాట తీరులో గాని, బిహేవియర్లో గాని చాలా తేడా వచ్చిందనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి.

2019 నుంచి 2024 వరకు తనతో తిరిగిన ఎందరో మహిళా నేతలను, మేడం సైలెంట్ గా సైడ్ చేసారనే విమర్శ కూడా ఉంది. ఇక ప్రెస్ లో హైలెట్ అయ్యేందుకు.. సెల్ఫ్ పీఆర్ క్రియేట్ చేసుకోవడంలో ఈ మాజీ టీచర్ గారు.. పీహెచ్ డీ చేసారు. అందుకే టీడీపీ సోషల్ మీడియా అకౌంట్స్ లో.. రీల్స్ రూపంలో వైరల్ అయ్యేందుకు, మీడియా సమావేశాల్లో ఆమె మాట్లాడుతున్న మాటలు, వాడుతున్న భాషపై కూడా కంప్లీట్ గా అసంతృప్తి ఉంది. హోం మంత్రి హోదాలో కొంత సెల్ఫ్ ప్రమోషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు.. ఆమెకే బూమ్ రాంగ్ అవుతున్నాయి.

వివాదాలకు మేడం క్రమంగా కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు. ఓ మహిళ కానిస్టేబుల్ చిన్న పిల్లని ఎత్తుకొని, ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆమెను ఇంటికి పిలిచి గౌరవించారు అనిత. ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్ వ్యవహారాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. వైసీపీ ప్రో.. మీడియా వాస్తవాలు బయటపెట్టింది. ఆ వాస్తవాలు.. పక్కా కరెక్ట్ అనే క్లియర్ కట్ పిక్చర్ వచ్చింది. దీనితో మేడం గారు కంగుతిన్న పరిస్థితి.

ఇక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే విషయంలో కూడా, కంట్రోల్ తప్పుతున్నారనే ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అసెంబ్లీలో ముఖ్యంగా శాసనమండలిలో.. ఆమె మాట్లాడుతున్న మాటలపై కూడా టిడిపి సర్కిల్స్ లో పెద్ద చర్చ జరుగుతోంది. తాను హోం మంత్రిని అనే అహంకారాన్ని మేడంగారు చూపిస్తున్నారని.. తాను ఇన్చార్జి మంత్రిగా ఉన్న విజయనగరంలో కూడా, ఇదే ఆటిట్యూడ్ కనపడుతోందని కనీసం స్థానిక ఎమ్మెల్యేలను గాని, జిల్లా మంత్రిని గాని ఆమె లెక్క చేయడం లేదనే డిస్కషన్ మొదలైంది.

సొంత జిల్లాలో కూడా ఇదే యాటిట్యూడ్ కనపడుతోంది. అది అక్కడితో ఆగకుండా.. ఆమె వద్ద పనిచేసే సిబ్బంది విషయంలో కూడా కొంత దూకుడు ప్రదర్శిస్తారనే కామెంట్ కూడా ఉంది. సాధారణంగా హోం మంత్రిగా ఉన్నప్పుడు వినయం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాబినెట్లో సీఎం తర్వాత, ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్న పదవి హోం మంత్రి. దళిత నేతలను హోం మంత్రి చేస్తున్న సంప్రదాయం 2009 నుంచి కొనసాగుతూ వస్తుంది. 2019లో వైయస్ జగన్ కూడా దళిత నేతలను హోం మంత్రులను చేశారు.

అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ టిడిపి కూడా, మహిళా దళిత నేతకు హోంమంత్రి పదవి కట్టబెట్టింది. పనిచేయడం పక్కన పెడితే, విమర్శల విషయంలో ఆ పదవిలో ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏక వచనంతో మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. టిడిపి సీనియర్ నేతలు కూడా రాజకీయ ప్రత్యర్థులను గౌరవిస్తూ ఉంటారు. క్రమశిక్షణకు మారుపేరుగా టిడిపిని చెబుతూ ఉంటారు.. ఆ పార్టీ అధినాయకులు. కాబట్టి వారిని ఫాలో కావాల్సిన అవసరం కూడా అనిత కు ఉంది.

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఇంటేన్షన్ తో, ఆమె చూపిస్తున్న ఆటిట్యూడ్ భవిష్యత్తులో ఆమె రాజకీయ జీవితానికి.. బ్రేకులు వేసే ఛాన్స్ ఉంది. రిపేర్ చేసుకునే ఛాన్స్, టైం కూడా మేడం గారికి ఉంది. 2024 నుంచి ఎక్కువగా విమర్శలు వచ్చిన శాఖ కూడా హోం శాఖ. కాబట్టి అనిత శాఖా పరంగా, వ్యక్తిగతంగాను పదవిలో ఉన్నప్పుడు మార్పులు చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని.. పై వారి మెప్పు కోసం, లేదంటే ఐటీడీపీ పొగడ్తల కోసం ఏకవచన పిలుపులు పిలిస్తే, మారుతున్న రాజకీయ వాతావరణంలో కచ్చితంగా ఊహించని షాక్ లు.. కోలుకోలేకుండా, తగిలే అవకాశం ఉంటుంది. అటు టిడిపి సీనియర్లు కూడా అనితకు కొంత సలహాలు ఇవ్వాలని ఆమె శ్రేయోభిలాషులు కోరుతున్నారు.

Published : 
  • 20 February 2026, 8:53 AM IST