రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలు వెన్నుపోట్లు .... ప్రత్యర్థిని నాశనం చేయడానికి కుయుక్తులు.... ఇవేనా?ప్రతిసారి డర్టీ పొలిటిషన్ గానే ఉండక్కర్లేదని నిరూపించాడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ముత్తు వెల్ కరుణానిధి స్టాలిన్. ఓటమిలోనూ గెలిచిన నాయకుడిగా, స్టాలిన్నీ ఇప్పుడు అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.107 సీట్లు మాత్రమే గెలిచి అధికారం అందుకోలేకపోతున్న టీవీకే అధినేత 52 ఏళ్ళ విజయ్ కి , ఊహించని విధముగా తెర వెనకనుంచి సహకరించి పెద్దరికం నిలబెట్టుకున్నాడు 73 ఏళ్ల స్టాలిన్. అంతేకాదు తమిళ రాజకీయాలను ఎవరో ఉత్తరాది పార్టీలు శాసించకుండా తెలివిగా అడ్డుకట్ట వేశాడు.
107 సీట్లు మాత్రమే గెలిచిన విజయ్ రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి కావడానికి తన డిఎంకె మిత్రపక్షాలు 13 మందిని వ్యూహాత్మకంగా టీవీకేకి మద్దతు ఇచ్చేటట్లు సహకరించాడు స్టాలిన్. ఆయన వల్లనే విజయ్ సీఎం పీఠం ఎక్కాడు. స్టాలిన్ అనే వ్యక్తి పరినీతి కనపరచకుండా ఉండి ఉంటే, విజయ్ అనే వాడు ఎప్పటికీ సీఎం అయ్యేవాడు కాదు. విజయ్ చేతిలో ఊహించని విధంగా డిఎంకె, అన్నా డీఎంకే పార్టీలు ఓడిపోయాయి. మళ్లీ ముఖ్యమంత్రి అవుతాను అనుకున్న డీఎంకే అధినేత స్టాలిన్ అంచనాలు తలకిందులు అయ్యాయి. పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లో నే... ఎవ్వరి సహకారం లేకుండా ఒంటరిగా పోటీ చేసి విజయ్ ముఖ్యమంత్రి అయిపోయాడు. కానీ స్టాలిన్ విజయ్ ని పడ గొట్టడానికి కుట్రలు చేయలేదు. కుతంత్రాలు చేయలేదు.మిగిలిన నాయకుల్లా కాకుండా మొదట తాను ఓడిపోయిన నియోజకవర్గానికి వెళ్లి.... తన ప్రజల్ని, కార్యకర్తల్ని కలిసి వచ్చాడు.
107 సీట్లు మాత్రమే సాధించి అధికారాన్ని అందుకోలేక కింద మీద పడుతున్న విజయ్ కి తెర వెనకే ఉండి సహకరించాడు. తన మిత్రపక్షాలైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వి సి కె పార్టీలు విజయ్ కి మద్దతు తెలుపుతున్నందుకు అడ్డు చెప్పలేదు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం వేళ స్టాలిన్ ప్రదర్శించిన ఈ రాజకీయ పరిణితి ఇప్పుడు అందరి ప్రశంసలు అంటుకుంటుంది. తన రాజకీయ చతురుతో, పలుకుబడితో అన్నడీఎంకేతో కలిసి అధికారం చేజిక్కించుకోవచ్చు. కానీ అలాంటి నీతిమాలి పనులకు సిద్ధపడలేదు స్టాలిన్. కాంగ్రెస్ డిఎంకెను వదిలిపెట్టి టీవీకే విజయ్ కి తన ఐదు సీట్లు ఇచ్చి మద్దతు పలికింది. మాట వరసకి కాంగ్రెస్ను విమర్శించినప్పటికీ, డీఎంకే కూటమిలో ఉన్న చిన్న పార్టీలు టీవీకేకు మద్దతు ఇస్తామని అన్నప్పుడు వ్యూహాత్మకంగా నిర్ణయాన్ని వాళ్ళ ఇష్టానికి వదిలేశారు స్టాలిన్. తన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నట్లు మాత్రం ప్రకటించాడు.
డీఎంకే కూటమి నుంచి మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చాయి. తనకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విజయ్ గవర్నర్ కి లేఖ ఇచ్చి.... మ్యాజిక్ ఫిగర్ ని చూపించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంకు సిద్ధపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీk కి 107 సీట్లు రాగా, స్టాలిన్ సారద్యంలోని డీఎంకే కూటమికి 72, అన్న డీఎంకే కూటమికి 53 సీట్లు వచ్చాయి. ఏదోరకంగా మళ్లీ సీఎం అయిపోదామనుకుంటే, స్టాలిన్ తన చిరకాల ప్రత్యర్థి అయినా అన్నడీఎంకేను కలుపుకొని ప్రభుత్వం స్థాపించవచ్చు. గవర్నర్ ఆ అవకాశం కూడా ఇచ్చారు. డీఎంకే ,అన్నా డీఎంకే, ద్రవిడ సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకుని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని వదంతులు కూడా వచ్చాయి. కానీ స్టాలిన్ కక్కుర్తి పడలేదు. అంతేకాదు తన ఆశలను కూల్చేసిన, తనను దారుణంగా ఓడించిన విజయనీ ముఖ్యమంత్రిగా నిలబెట్టారు. తన కూటమి నుంచి 11 మంది విజయ్ టీవీకేకు మద్దతుగా వెళ్లిన ,ఎటువంటి ఆటంకం కలిగించలేదు.
మీరు మీ ఇష్టపూర్వకంగా వ్యవహరించండి అని చెప్పడం ద్వారా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు స్టాలిన్. స్టాలిన్ నిర్ణయం వల్లే తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి అడ్డుకట్ట పడింది.తనకి అధికారం దక్కకపోయినా స్టాలిన్ రాజ్యాంగ సంక్షోభం సృష్టించవచ్చు. కానీ అలాంటి చిల్లర వేషాలకు దూరంగా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి... వేరే ఒకరికి తన కుర్చీ నిజాయితీగా ఆఫర్ చేయగలిగాడు డీఎంకే అధినేత. అంతేకాదు బిజెపి చేతిలో తమిళ పార్టీలు చిక్కుకోకూడదనే ఏకైక లక్ష్యంతో తెలివిగా విజయ్ నీ సీఎం చేసి, తాను కాంగ్రెస్కు శత్రువుగా మిగిలిపోయాడు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా కాంగ్రెస్కు దూరంగా వెళ్లిపోయాడు స్టాలిన్. అందుకే స్టాలిన్ ది గ్రేట్ అని ప్రశంసిస్తున్నారు జనం.