Top story:ప్రపంచాన్ని వణికిస్తోన్న ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌, సె*క్స్ స్కాంలో దేశాధ్యక్షులు, వీఐపీలు…!

ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం...ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పలు దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, రాజకీయ నేతలు, వీఐపీలు, సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు...

Post Published By: dialnews
Updated : 6 February 2026, 10:41 AM IST

ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం...ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పలు దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, రాజకీయ నేతలు, వీఐపీలు, సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు...ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌కు దెబ్బకు వణికిపోతున్నారు. 2వేలకు పైగా వీడియోలు, సుమారు లక్షల ఫొటోలను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది.ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం ఫైళ్లు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏ దేశంలో చూసినా...ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌ గురించే చర్చ జరుగుతోంది. ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో ఏ యే దేశాల అధ్యక్షులు ఉన్నారు ? ఎవరెవరు సన్నిహిత సంబంధాలు కొనసాగించారు ? మైనర్లను ఏ యే దేశాల నుంచి కిడ్నాప్‌ చేశారు ? ఎప్‌స్టిన్‌ ఐలాండ్‌కు వెళ్లిన సెలబ్రెటీలు ఎవరు ? అన్నది చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రభుత్వం 30 లక్షల ఎప్‌స్టీన్‌ పేజీలను బయటపెట్టింది. వీటితోపాటు 2,000 వీడియోలు, 1,80,000 ఫొటోలనూ విడుదల చేసింది. ఆ ఫొటోలన్నీ సెక్స్ రాకెట్ నిర్వాహకుడు ఎప్‌స్టీన్ కంప్యూటర్, ఈమెయిల్స్ నుంచి దర్యాప్తు విభాగాలు సేకరించినవే.

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ ట్రాన్స్‌పరెన్సీ చట్టం కింద అమెరికా న్యాయశాఖ వెబ్‌సైట్‌లో ఈ పత్రాలు, వీడియోలు, ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. ఫైల్స్‌లో చనిపోయిన మిలియనీర్‌ ఫైనాన్షియర్‌ ఎప్‌స్టీన్‌ ఆధ్వర్యంలో మైనరు బాలికలపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. కరేబియన్ సముద్రంలో ఎప్‌స్టీన్‌కు సొంతంగా లిటిల్‌ సెయింట్‌ గేమ్స్‌, గ్రేట్‌ సెయింట్‌ గేమ్స్‌ అనే రెండు దీవులుండేవి. ఇక్కడికి...సంపన్నులైన మిత్రులను తీసుకొచ్చి.. మైనర్ అమ్మాయిలతో వారికి లైంగిక సంబంధాలు ఏర్పరిచాడనే ఆరోపణలున్నాయి. ఇలా ఏళ్ల పాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ రాజకీయ నాయకులు, బిజినెస్ టైకూన్లు, సెలబ్రిటీలకు ఎప్‌స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని.. అభియోగాలున్నాయి.

పత్రాల విడుదల వేళ...బాధిత యువతుల ఫొటోలు, పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. బాధితుల గోప్యత కోసం అమెరికా న్యాయశాఖ వందలాది న్యాయవాదులను నియమించింది. చట్టానికి అనుగుణంగా స్పందిస్తూ, బాధితుల గుర్తింపును రక్షించేందుకు ఏ సమాచారాన్ని బ్లాక్ చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఇక విడుదల చేసిన వీడియోలు, చిత్రాల్లో గిస్లేన్ మ్యాక్స్‌వెల్‌ను తప్పించి, మిగిలిన మహిళలందరి గుర్తింపులను అస్పష్టం చూపించినట్లు న్యాయశాఖ తెలిపింది.

తాజాగా విడుదలైన పత్రాల్లో డోనాల్డ్‌ ట్రంప్‌, బిల్ గేట్స్, స్టీవ్ బ్యానన్, వూడీ అలెన్, మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్ వంటి ప్రముఖులు ఎప్​స్టీన్ కలిసి ఉన్న చిత్రాలు కూడా ఉన్నాయి. కొన్నింటిలో వారు ఎప్​స్టీన్ ప్రైవేట్ దీవిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వీరిలో ఎవరిపైనా ఇప్పటి వరకు ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు. ట్రంప్ సహా కొందరు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు.. ఎప్‌స్టీన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోజులు, ఆయన ఐల్యాండ్‌లో సేదతీరిన ఫోటోలు బయటకొచ్చాయి. డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్‌కి సంబంధించి చాలా ఫోటోలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ సహా కొందరు హాలీవుడ్ హీరోలు కూడా.. జెఫ్రీ ఎప్‌స్టీన్ పార్టీలకు హాజరైన ఫోటోలు కూడా.. విడుదలైన ఫైల్స్‌లో ఉన్నాయి.

ఎప్‌స్టీన్‌ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో...24 గంటల్లోనే 16 ఫైళ్లు మాయమవడం కలకలం రేపింది. అమెరికా న్యాయశాఖ వెబ్‌పేజీ నుంచి అదృశ్యమైన ఈ ఫైళ్లలో.. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫొటో ఉండటంతోనే మాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం అమెరికాలోనే కాదు.. టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారింది. ఆ ఫైల్స్‌ని ఎందుకు తొలగించాల్సి వచ్చిందనేదానిపై వైట్‌హౌజ్‌ ఇప్పటిదాకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వాటిని ఉద్దేశపూర్వకంగానే తొలగించారా ? పొరపాటున జరిగిందా ? మరేదైనా కారణంతోనే.. మాయం చేశారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

మిస్ అయిన 468 నెంబర్ ఫైల్‌లో.. ట్రంప్‌‌తో పాటు ఆయన భార్య మెలానియా, ఎప్‌స్టీన్‌, అతని క్రైమ్ పార్ట్‌నర్ గిస్లైన్‌ మాక్స్‌వెల్‌‌కి సంబంధించిన ఫోటోలు, ఇతర వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు బాధితుల నుంచి ఎఫ్‌బీఐ తీసుకున్న వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖకు మెమోలు లాంటి.. కేసుకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫైల్స్ చుట్టూ మొదలైన వివాదాన్ని.. డెమోక్రాట్లు రాజకీయ ఆయుధంగా మార్చుకుంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం నిజాలను తొక్కిపెడుతోందనే ప్రచారం మొదలుపెట్టారు. ఇది.. ట్రంప్ పాలనకు ఓ మచ్చలా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Published : 
  • 6 February 2026, 10:41 AM IST