ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులకు క్లీన్ చిట్… కేజ్రీవాల్ , కవిత తో సహా 23 మంది నిర్దోషులే…!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రౌస్ అవెన్యూ కోర్ట్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిస్సోడియా, కల్వకుంట కవితతో సహా 23 మందికి సిబిఐ కేసులో క్లీన్ చిట్ చేసింది.

Post Published By: dialnews
Updated : 28 February 2026, 1:55 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రౌస్ అవెన్యూ కోర్ట్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిస్సోడియా, కల్వకుంట కవితతో సహా 23 మందికి సిబిఐ కేసులో క్లీన్ చిట్ చేసింది. అంతేకాదు సిబిఐ దాఖలు చేసిన చార్షీట్లో ప్రైమ ఫేస్ లేదని, నిందితులపై సిబిఐ చేసిన అభియోగాలకు సరిపడా ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. చార్జీ సీట్లో చాలా లోపాలు ఉన్నాయని, వాటికి సాక్ష్యాలు, సాక్షులు, స్టేట్మెంట్ల సపోర్ట్ కూడా లేదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు విచారణ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్ట్ సిబిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్జిషీట్ మొత్తం లోపాలేనని కేస్ కొట్టేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం పై సిబిఐ కేసు.... దేశంలో పరిస్థితులకు అద్దం పడుతుంది.అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? ఉంటే ఇంత దారుణ పరిస్థితిలో ఉందా? దేశ అత్యుత్తమ దర్యాప్తు సంస్థ పనిచేసే తీరు ఇదేనా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రౌస్ అవెన్యూ కోర్టు.... కవిత సహా మిగిలిన వారంతా నిర్దోషులేనని అభిప్రాయపడితే.... మరి వాళ్లంతా ఇన్నాళ్లు జైల్లో ఎందుకు ఉన్నట్లు. ?మనిషి సిసోడియా యాడాదిన్నర పాటు ఈ కేసులో జైల్లో మగ్గిపోయాడు. కల్వకుంట్ల కవిత ఐదున్నర నెలల పాటు తీహార్ జైల్లో ఉంది. అనేక రాజకీయ విమర్శలు ఎదుర్కొంది. ఇక ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ సైతం జైలు పాలయ్యాడు. అంటే వీళ్లంతా అన్యాయంగా జైల్లో ఇన్నాళ్లు ఉన్నారా? ఏ ఆధారాలు లేకుండానే సి.బి.ఐ వీళ్ళని జైల్లో పెట్టిందా? ఒకవేళ అలా ఆధారాలు లేకుండా సిబిఐ వీళ్ళని అరెస్టు చేస్తే కోర్టులు ఏం చేస్తున్నాయి? అలా ఎవరిని పడితే వాళ్ళని అరెస్టు చేస్తే నెల తరబడి కోర్టులు వాళ్ళని రిమాండ్ పేరుతో జైల్లోనే ఉంచుతాయా? సిబిఐ ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరినైనా అరెస్టు చేసి ఎన్నాళ్ళైనా జైల్లో పెట్టవచ్చా? చివర్లో మీరు దోషులు అనడానికి ఆధారాలు లేవు అని చేతులు కడిగేసుకుంటే అయిపోతుందా?

రావుస్ అవెన్యూ కోర్ట్ తీర్పు ప్రకారం... సి.బి.ఐ అనే ఒక అత్యున్నత సంస్థ దర్యాప్తు ఎంత బలహీనంగా ఉంటుందో దేశ ప్రజలందరికీ అర్థమైంది. ఇండియా మొత్తం సంచలనం సృష్టించిన ఒక కేసుని ఆధారాలు లేకుండా ఫైల్ చేయడం ఏమిటి? ఆధారాలు లేకుండా చార్జిషీటు కోర్టు ముందు ఉంచడం ఏమిటి? సీబీఐ దర్యాప్తు ఇంత బలహీనంగా ఉంటుందన్నమాట. కేసులోనే దర్యాప్తు ఎంత బలహీనంగా ఉంటే సాదాసీదా కేసుల్లో ఇంకెంత దారుణంగా ఉంటుందో?

ఈ కేసులో అరెస్టు అయిన వాళ్లంతా దేశంలో ప్రముఖ రాజకీయ వేత్తలు, వాళ్ల అనుచరులు. ఎంతో కొంత రాజకీయ పలుకుబడి కూడా ఉన్నవాళ్లు. ఆర్థికంగా బలమైన వ్యక్తులు, శక్తులు. అలాంటి వాళ్ళనే తీసుకెళ్లి ఆధారాలు లేకుండా జైల్లో పడేస్తే.... సామాన్యుల పరిస్థితి ఏంటి? సిబిఐ లాంటి సంస్థ ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరిపైనైనా కేసులు పెట్టి జైల్లో కుక్కేయ వచ్చా? పొలిటిషన్లు... బాగా డబ్బున్న మారాజులు గనుక వాళ్ళు కోర్టుల్లో పోరాడారు. సామాన్యులను ఇలా అరెస్టులు చేసి జైల్లో పడేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ల కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు ?ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ... కేంద్రం అధీనంలో పనిచేసే సంస్థ ,ఆధారాలు లేకుండా ఎన్ని దారుణాలు కి ఒడిగడుతోందో తలుచుకుంటే భయం వేస్తుంది.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడేళ్ల అయిపోతుంది. ఈరోజు వరకు ఆ కేసులో నిందితులు ఎవరో సిబిఐ తేల్చలేకపోయింది. ఆయేషా మీరా అనే అమాయకురాలని రేప్ చేసి చంపేస్తే దశాబ్దాలు దాటిన..... హంతకుడిని పట్టుకోలేక కేసు క్లోజ్ చేసేసింది సిబిఐ. జగన్ అక్రమాస్తుల కేసు ఈనాటి వరకు తేల్లేదు. సిబిఐ దర్యాప్తు చేసిన ఓబులాపురం మైన్స్ కేస్ ఏమైందో తెలియదు. ఇలాంటి ఎన్నో కేసులు గాలి కి కొట్టి పోయాయి. సిబిఐ పనితీరు ఎంత చెత్తగా ఉంటుంది అనడానికి ఈ కేసులే ఉదాహరణ. అలాంటి సిబిఐ కేవలం కేంద్రం చేతిలో చేతి కర్రగా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థుల్ని లొంగదీసుకోవాలంటే వాళ్లపై సిబిఐ ప్రయోగిస్తున్నారు.... అని దేశం మొత్తం మీద ఒకే రకమైన విమర్శిన్పిస్తోంది. దేశంలో అత్యున్నత నిఘా దర్యాప్తు సంస్థ ఇలా తయారైతే ఇక్కడ ఎవరికీ రక్షణ దొరుకుతుంది? భద్రత లభిస్తుంది?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి పెద్ద కేసును ఆధారాలు లేకుండా ఎలా చార్జిషీటు తయారు చేసింది సిబిఐ? కేసును నీరుగార్చడానికి ఇలా చేసిందా? లేక అసలు ఈ కేసులో పసలేదా? దేశం మొత్తాన్ని ఊపేసిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో
అసలు మ్యాటర్ లేదంటూ ఒక్క కలం పోటుతో రౌస్ ఎవెన్యూ కోర్ట్ కేసు కొట్టి పడేస్తే... సి.బి.ఐ అనే సంస్థ ప్రతిష్టకి అర్థం ఏముంది? ఒక సాదాసీదా రూరల్ పోలీస్ స్టేషన్ కి సి.బి.ఐ కి తేడా ఏముంది? అసలు సి.బి.ఐ లిక్కర్ కేసు ఎందుకు పెట్టింది? ఎవరి ప్రభావం తో పెట్టింది? చివరికి ఏం సాధించింది? దర్యాప్తు కోసం ఎంత డబ్బు... సమయం వృధా చేసింది? చివరికి తన ప్రతిష్టని సి.బి.ఐ రౌస్ అవెన్యూ కోర్ట్ సాక్షిగా ఎలా దిగజార్చుకుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

రావుస్ ఎవెన్యూ కోర్ట్ అభిప్రాయమే నిజమైతే.... కేంద్రం సిబిఐ అనే ఒక ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని తన రాజకీయ ప్రత్యర్థులను ఎలా కావాలంటే అలా అనగదొక్కొచ్చు. ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు కూడా. ఏదో ఒక రకంగా వాళ్ళని దారికి తెచ్చుకోవచ్చు. అంతేగాని ఒక నేరం జరగొచ్చు జరగకపోవచ్చు. ప్రత్యర్థుల్ని భయపెట్టడానికే సిబిఐ అనే ఆయుధాన్ని కేంద్రం ప్రయోగిస్తుంది. అంతకుమించి సిబిఐ ప్రజలకి ఏ రకంగానూ ఉపయోగపడటం లేదు. సిబిఐ, ఈ డి, ఐటీ ఇవి కేవలం కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి జేబు సంస్థ లేనని మరోసారి రుజువైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ అత్యున్నత సంస్థ పరువు బజారు పాలయింది.

 

Published : 
  • 28 February 2026, 1:55 PM IST