ప్రపంచంలోనే అత్యుత్తమ రక్షణ వ్యవస్థ ఏదంటే అమెరికా తన 'థాడ్' మరియు 'పేట్రియాట్' పేర్లు చెబుతుంది. గల్ఫ్ దేశాలకు భద్రత కల్పిస్తామని, ఇరాన్ నుంచి కాపాడుతామని చెప్పి కొన్ని వేల కోట్ల డాలర్లు దండుకుంది. కానీ, అసలు యుద్ధం మొదలయ్యాక అమెరికా టెక్నాలజీ ఒక పెద్ద 'డొల్ల' అని తేలిపోయింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల ముందు అమెరికా గర్వపడే థాడ్ వ్యవస్థలు ఎందుకు పని చేయలేదు..? 142 బిలియన్ డాలర్ల ఒప్పందం బుగ్గిపాలైందా..? ఆ షాకింగ్ వివరాలు ఈ వీడియోలో చూద్దాం.
సంవత్సరాల తరబడి లాక్‌హీడ్ మార్టిన్ లాంటి అమెరికా రక్షణ సంస్థలు గల్ఫ్ దేశాలకు ఒక నమ్మకాన్ని అమ్మాయి. "మా దగ్గర థాడ్ ఉంది, పేట్రియాట్ PAC-3 ఉంది.. వీటిని దాటుకుని ఈగ కూడా రాదు" అని బిల్డప్ ఇచ్చారు. బాలిస్టిక్ క్షిపణులను వాటి చివరి దశలో కూల్చివేస్తామని ప్రచారం చేసి, గల్ఫ్ దేశాల చేత పదుల బిలియన్ల డాలర్లు ఖర్చు చేయించారు. నిజానికి ఇది రక్షణ కోసం చేసిన ఏర్పాటు కాదు, అమెరికా ఆయుధ కంపెనీల జేబులు నింపుకోవడానికి చేసిన ఒక పెద్ద స్కామ్.
సీన్ కట్ చేస్తే.. 2025 మే నెలలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియాద్‌లో వాలిపోయారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అక్షరాలా 142 బిలియన్ డాలర్లు.. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల డీల్. ఇందులో థాడ్ సిస్టమ్స్, అధునాతన పేట్రియాట్ క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. ఇరాన్ భయం చూపించి సౌదీ అరేబియాకు ఈ తుప్పు పట్టిన సామాన్లన్నీ అంటగట్టారు. ఇరాన్ సత్తా ఏంటో తెలియక, అమెరికా ఇచ్చే భద్రతా గొడుగు కింద అంతా సేఫ్ అనుకున్నారు.
కానీ అసలైన పరీక్ష తొమ్మిది నెలల తర్వాత ఎదురైంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు ప్రారంభించగానే.. ఇరాన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతిదాడికి దిగింది. అప్పుడే తెలిసింది అమెరికా టెక్నాలజీ అసలు రంగు. వేల కోట్లు పోసి కొన్న థాడ్ వ్యవస్థలు నిద్రపోయాయా లేక ఇరాన్ క్షిపణుల వేగాన్ని అందుకోలేక చేతులెత్తేశాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఇరాన్ ప్రయోగించిన అత్యాధునిక క్షిపణులు అమెరికా రక్షణ కవచాన్ని చీల్చుకుంటూ వెళ్లి లక్ష్యాలను తుత్తునియలు చేశాయి. పెంటగాన్ గర్వంగా చెప్పుకునే ఒక్క పేట్రియాట్ కూడా ఇరాన్ క్షిపణులను ఆపలేకపోయింది.
థాడ్ వ్యవస్థ క్షిపణులను వాటి చివరి దశలో కూల్చాలి. కానీ ఇరాన్ క్షిపణులు హైపర్ సోనిక్ వేగంతో లేదా లో-ఆల్టిట్యూడ్ అంటే తక్కువ ఎత్తు లో రావడంతో ఈ రాడార్లు వాటిని గుర్తించలేకపోయాయి. పేట్రియాట్ PAC-3 బ్యాటరీలు కూడా ప్రేక్షక పాత్ర పోషించాయి. సౌదీ దగ్గర ఆయుధాలు లేక కాదు. ఉన్న ఆయుధాలు ఇరాన్ టెక్నాలజీ ముందు మొద్దుబారిపోయాయి. 142 బిలియన్ల డాలర్లలో సాయుధ డ్రోన్లు, భారీ ఆయుధ నిల్వలు ఉన్నా.. ఇరాన్ మెరుపు దాడిని అవి కనీసం అడ్డుకోలేకపోయాయి
అమెరికా ఆయుధాలు కొంటూనే, సౌదీ రాజులు 2023లోనే ఒక స్మార్ట్ గేమ్ ఆడారు. చైనా మధ్యవర్తిత్వంతో ఇరాన్‌తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. 2001 నాటి భద్రతా ఒప్పందాన్ని మళ్ళీ దుమ్ము దులిపి బయటకు తీశారు. అంటే అమెరికా గొడుగు ఎప్పుడైనా చిరిగిపోతుందని సౌదీకి ముందే తెలుసు. రియాద్ తన భద్రత కోసం కేవలం వాషింగ్టన్ వైపు చూడటం ఆపేసింది. ఈ విషయాన్ని 'ది న్యూయార్క్ టైమ్స్' పత్రిక కూడా ప్రముఖంగా రాసింది. అమెరికా ఆయుధ కంపెనీలకు బిలియన్లు ఇచ్చినా, మనశ్శాంతి మాత్రం బీజింగ్ ఒప్పందంతోనే దొరుకుతుందని సౌదీ ఫిక్స్ అయిపోయింది.
ఈ ఏడాది ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా సన్నాహాలు చేస్తున్నప్పుడు సౌదీ గట్టిగా అడ్డు నిలిచింది. 'మా గగనతలాన్ని వాడుకోవద్దు.. మా బేస్‌లను వాడటానికి వీల్లేదు' అని మొహం మీద చెప్పేసింది. ప్లాన్ ఏంటో చెప్పకుండా, లక్ష్యాలను పంచుకోకుండా మా ప్రాణాలతో ఆడుకుంటారా..? అని అమెరికాను సౌదీ నిలదీయడం పెంటగాన్‌కు పెద్ద అవమానం. అంటే అర్థం చేసుకోండి.. అమెరికా ఆయుధాలు కేవలం ప్రదర్శనకే పనికొస్తాయి తప్ప, ఇరాన్ లాంటి ధైర్యవంతుల దేశం మీద పని చేయవు.
ఈ యుద్ధంతో ఇరాన్ తన సైనిక పటిమను ప్రపంచానికి చాటి చెప్పింది. అమెరికా నమ్ముకున్న టెక్నాలజీ ఫెయిల్ అయింది, వారి భద్రతా గొడుగు చిరిగిపోయింది. 142 బిలియన్ డాలర్లు గంగలో పోసినట్టే అయ్యింది. ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఆలోచనలో పడ్డాయి.. అమెరికా సామాన్లు నమ్ముకుంటే ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని అర్థం చేసుకున్నాయి. ఇరాన్ తన తెలివితేటలతో అగ్రరాజ్యం అమెరికాకు ఎలా చుక్కలు చూపించిందో. అమెరికా ఇచ్చే 'గాలి' వాగ్దానాలు ఇక చెల్లవు. అమెరికా ఆయుధాలు నిజంగానే ఫెయిలయ్యాయా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.