ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని కాంగ్రెస్ హై కమాండ్ ఖరారు చేసింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. దానిలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే.... అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించి.... రాజగోపాల్ రెడ్డికి ఇవ్వబోతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదు కనుక రెండున్నర సంవత్సరాలకు పైగా మంత్రిగా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ మంత్రివర్గం నుంచి తొలగించి, అదే స్థానంలో రాజగోపాల్ రెడ్డికి పదవి ఇస్తున్నారు. ఇది దాదాపు ఖరారు అయిపోయింది.
ప్రత్యామ్నాయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ పదవితో పాటు, ప్రభుత్వంలో కూడా క్యాబినెట్ హోదా ఉండే మరో పదవి ఇచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండడం సాధ్యం కాదని అధిష్టానం తేల్చి చెప్పేసింది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మౌనంగానే అంగీకారం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిరేకల్ సభకు కోమటిరెడ్డి డుమ్మా కొట్టారు. అనారోగ్యం... వేరే కార్యక్రమాలతో బిజీగా ఉండడం వల్లే ముఖ్యమంత్రి సభకు రాలేకపోయానని చెప్పినప్పటికీ... అసలు కారణం ఆయన్ని క్యాబినెట్ నుంచి డ్రాప్ చేయబోతున్నారు.
నకిరేకల్ సభ మొత్తం రాజగోపాల్ రెడ్డి బల ప్రదర్శన సాగింది.ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ గురించి సమాచారం ఉండటంతో... రాజగోపాల్ రెడ్డి నకిరేకల్ సభలో సీఎం కి పక్కనే కూర్చుని చాలా సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించారు.
రాజగోపాల్ రెడ్డికి మునుగోడు సీటు ఇచ్చినప్పుడే కాంగ్రెస్ హాయ్ కమాండ్ నుంచి మంత్రి పదవి ఇస్తామని స్పష్టమైన హామీ ఉంది. అదే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి రెండేళ్లలో పదేపదే గుర్తు చేస్తున్నారు. తనకు అన్న వెంకట్ రెడ్డి మంత్రి పదవితో సంబంధం లేదని, మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ హై కమాండ్ హామీ ఇచ్చింది కనుక, కచ్చితంగా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పనిలో పనిగా సీఎం రేవంత్ రెడ్డి పై ఘాటు విమర్శలు చేయడం తోపాటు.... టిడిపి నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలపై కూడా పరోక్షంగా మాటల తోటలు పేలుస్తూ ఉంటారు. రాజగోపాల్ రెడ్డితో రచ్చ చేసుకోవడం కంటే..... మంత్రి పదవి ఇచ్చి దానికి తెచ్చుకోవడం మంచిదని కాంగ్రెస్ అధిష్టానం గొడవ నిర్ణయానికి వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే సమాచారం కూడా ఇచ్చారు. అహిష్టంగానే దాన్ని అంగీకరించిన వెంకటరెడ్డి... ఇతర కార్యక్రమాల్లో ఈ మధ్య నిమగ్నం అవుతున్నారు. మొత్తం మీద నయానో భయానో అనుకున్నది సాధించారు రాజగోపాల్ రెడ్డి.