నన్ను అడ్డం పెట్టుకుని, ఎమోషనల్ అయిన విజయమ్మ

ఇటీవల వైఎస్ విజయమ్మ కారు ప్రమాదానికి వైఎస్ జగన్ కారణం అంటూ టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న పోస్ట్ లు సంచలనంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్ విజయమ్మ ఓ లేఖతో వాటిని ఖండించారు. “గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రదారం నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది.

Post Published By: Vencateshg
Updated : 4 November 2024, 4:52 PM IST

ఇటీవల వైఎస్ విజయమ్మ కారు ప్రమాదానికి వైఎస్ జగన్ కారణం అంటూ టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న పోస్ట్ లు సంచలనంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్ విజయమ్మ ఓ లేఖతో వాటిని ఖండించారు. “గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రదారం నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. కొంతమంది సోషల్ మీడియాలో లేనిపోని అసత్య కథనాలు ప్రచారం చేయడం చూస్తుంటే నాకు తీవ్ర మానసిక వేదన కలుగుతోంది. నన్ను అడ్డం పెట్టుకుని చేస్తున్న నీచ, నికృష్ణ రాజకీయాలకు ఖండించకపోతే ప్రజలు నిజం అని నమ్మే ప్రమాదం ఉంది.

వాస్తవాలను, కొంత మంది దుర్మార్గపు ఉద్దేశాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే నేను ఈ వివరణ రాస్తున్నాను. రెండు రోజుల కిందట నా కారుకు ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఎప్పుడో జరిగిన నా కారు ప్రమాదాన్ని నా కుమారుడి పై పెట్టి దుష్ప్రచారం చెయ్యడం అత్యంత జుగుప్సాకరం. రాజకీయంగా లబ్ది పొందాలనే ఈ ప్రయత్నం అత్యంత దర్మార్గం. అమెరికాలో ఉన్న నా మనవడి దగ్గరకు వెళితే దాన్ని కూడా తప్పుగా చిత్రకరించి... భయపడి నేను విదేశాలకు వెళ్ళిపోయినట్లు దుష్పచారం చెయ్యడం అత్యంత నీతిమాలిన చర్య.

రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇలా దుష్ప్రదారంతో ప్రజలను తప్పుదోవ పట్టిందాలనే విధానం ఏమాత్రం సమర్ధనీయం కాదు. ఈ నీద సంస్కృతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఇకముందు ఇటువంటి దుష్ప్రచారాలను, వ్యక్తిత్వహనన వైఖరిని ఆపితే మంచిది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ వికృత చేష్టలను గమనిస్తూనే ఉన్నారు. సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెబుతారు. ఇక పై ఇటువంటి లేనిపోని అసత్యలను ప్రదారం చేస్తే నేను చూస్తూ ఊరుకోదలచుకోలేదు.” అంటూ విజయమ్మ పోస్ట్ చేసారు.

Published : 
  • 4 November 2024, 4:52 PM IST