అమెరికా, ఇజ్రాయిల్ – ఇరాన్ ల మధ్య యుద్ధం మొదలైంది. శనివారం ఉదయం నుంచి ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు దిగాయి. క్షిపణి దాడులు చేయడంతో ఇరాన్ కూడా అదే స్థాయిలో బదులు ఇస్తోంది. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన క్షిపణులను గుర్తించిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది ఇజ్రాయిల్.
అత్యవసర సేవలు మినహా మిగిలిన కార్యక్రమాలు అన్నీ రద్దు చేసింది. ఇక ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని ఇరాన్ బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియాతో పాటు అబుదాబి, ఖతార్, యూఏఈ, జోర్డాన్‌పై ఇరాన్ దాడులు చేసింది.