Top Story: ఈ పాపం ఎవరిది? చంద్రబాబు స్వయంకృతాపరాధమే పుట్టామహేష్ అరాచకం…!

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా అరెస్టై బెయిల్ పై ఉన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ పై పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి.... టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంకృత అపరాధమే

Post Published By: dialnews
Updated : 18 March 2026, 12:55 PM IST

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా అరెస్టై బెయిల్ పై ఉన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ పై పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి.... టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంకృత అపరాధమే పుట్ట మహేష్ డ్రగ్స్ కేస్ అని, బాబుకి అన్నీ తెలిసే పుట్ట మహేష్ కి ఎంపీగా సీటు ఇచ్చి ఇవాళ తన పరువు తానే తీసుకున్నాడని టిడిపి పార్టీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. పుట్ట మహేష్ వ్యాపారవేత్త. ఆయన తండ్రి పుట్ట సుధాకర్ యాదవ్ టీటీడీ మాజీ చైర్మన్. పుట్ట మహేష్ టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రెండో అల్లుడు. మొత్తం మీద ఒక్క కుటుంబానికే టిడిపిలో నాలుగు సీట్లు దక్కాయి.ఎమ్మెల్సీగా యనమల రామకృష్ణుడు, మైదుకూరు ఎమ్మెల్యేగా ఆయన వియ్యంకుడు, మహేష్ తండ్రి సుధాకర్ యాదవ్. యనమల రామకృష్ణుడు మొదటి కుమార్తెకు తుని ఎమ్మెల్యేగా సీటు., ఈ మూడు చాలవు అన్నట్లు ఎక్కడో కడప జిల్లా మైదుకూరు నుంచి తీసుకొచ్చి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ సీటు పుట్ట మహేష్ కి కట్టబెట్టారు చంద్రబాబు.

చంద్రబాబు ఆ ఒక్క కుటుంబానికే నాలుగు పదవులు ఇచ్చినట్లు అయింది. కేవలం పార్టీ ఫండ్ కి, డబ్బులకి కక్కుర్తి పడి, పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడిగా పుట్ట మహేష్ ఇచ్చే ఎలక్షన్ ఫండింగ్ నీ ఆశించి ఎక్కడో కడప జిల్లా నుంచి తీసుకొచ్చి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ సీటు ఆయనకి ఇచ్చారని ,అప్పట్లోనే స్థానిక నేతలు బహిరంగంగానే మాట్లాడుకున్నారు. అసలు పుట్టా మహేష్ యాదవ్ కి ఏలూరు తో ఏం సంబంధం? అసలు జీవితంలో ఎప్పుడైనా ఏలూరు వచ్చాడా? ఇక్కడి పరిస్థితులు తెలుసా అలాంటి వ్యక్తికి ఎంపీ సీటు ఎలా ఇస్తారంటూ బహిరంగంగానే నిలదీశారు. వ్యతిరేకించారు కూడా. పార్టీ జెండా మోసిన నేతలను... కార్యకర్తలను కాదని ఎక్కడో బయట ప్రాంతం నుంచి తీసుకొచ్చి క్షణాల్లో ఎంపీలను చేయాల్సిన అవసరం ఏముందని అప్పట్లోనే జనం మాట్లాడుకున్నారు. ఇదంతా డబ్బు మహిమ అని తిట్టిపోశారు. కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ 2024 లోక్సభ ఎన్నికల ముందు ఇవేమీ పట్టించుకోలేదు. యాంటీ జగన్ వేవ్ లో కుక్క నీ నిలబెట్టిన అది గెలుస్తుంది అనే నమ్మకంతో దుబాయ్ నుంచి డైరెక్ట్ గా ఫ్లైట్లో తీసుకొచ్చి పుట్ట మహేష్ కి ఏలూరు ఎంపీ సీట్ ఇచ్చి ప్రచారం చేయించారు.

నిజానికి మాగంటి బాబు ఏలూరు టిడిపి ఎంపీ సీటు ఆశించారు. కానీ పరిస్థితుల ప్రభావం వలన మాగంటి బాబు ఆర్థికంగా చిదిగిపోయారు.2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కానీ పార్టీ కోసమే ఆయన కుటుంబ ఆస్తుల్ని ధారబోశారు. దురదృష్టవశాత్తు ఇద్దరు కొడుకుల్ని కూడా కోల్పోయారు.చంద్రబాబు స్టైల్ ఆఫ్ రాజకీయం తెలుసు కదా. మాగంటి ఆర్థికంగా దెబ్బతిన్నారు అనగానే ఆయననీ తీసి పక్కన పెట్టేసారు. అప్పటికే దుబాయిలో సెటిలైపోయి, అక్కడే కాపురం ఉంటున్న పుట్ట మహేష్ ని డైరెక్ట్ గా విమానంలో తీసుకొచ్చి దించి ఎంపీగా బీఫామ్ ఇచ్చేశారు. ఈ నిర్ణయంపై స్థానిక నేతలు గగ్గోలు పెట్టారు. మాగంటి బాబు కాకపోతే చాలామంది లోకల్ లీడర్స్ ఉన్నారు.....వాళ్లని కాదని, డబ్బుకి కక్కుర్తి పడి బయట నుంచి లీడర్లను తీసుకువచ్చి పోటీ చేయించి... పార్టీ పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అప్పుడు లోకేష్ గాని, చంద్రబాబు గాని ఇవేమీ పట్టించుకోలేదు.

ఎంపీ అయ్యాక పుట్ట మహేష్ నెలకి ఒక్కసారి కూడా ఏలూరు కాన్స్టెన్సీ కి రాలేదు. ఎప్పటిలాగే ఆయన సగం కాలం దుబాయ్ లోనే గడిపేశారు. చిత్రమైన విషయం ఏంటంటే ప్రధాని మోడీ ఏపీకి వచ్చిన, చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన... ఆ సమావేశాలు కి కూడా పుట్ట ఎప్పుడు హాజరు కాలేదు. ఇదే విషయం పై ఏలూరులో గోల గోల అవుతుంది. ఇదే స్థానిక నేతకు టికెట్ ఇచ్చి ఉంటే జనానికి అందుబాటులో ఉండేవాడు కదా అని టిడిపి గోదావరి జిల్లా నేతలు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు.ఇప్పుడు పుట్ట మహేష్ డ్రగ్స్ కేసులో దొరికిన తర్వాత.... చాలామంది పశ్చిమగోదావరి జిల్లా నేతలు... ఎంపీ గారికి తిక్క కుదిరింది అని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ప్రజల్లో ఉండి.... ప్రజా ఉద్యమాలు చేసి... ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకులను కాదని, ఎక్కడో దుబాయిలో వ్యాపారం చేసుకునే కడప జిల్లా రిచ్ కిడ్ ని తీసుకొచ్చి, డబ్బులుకి టికెట్లు అమ్ముకొని ఊరు పేరు కూడా తెలియని ప్రాంతానికి ఎంపీల నో చేసేస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి.... అని నెత్తినూరు కొట్టుకుంటున్నారు టిడిపి నేతలు. నియోజకవర్గం వదిలేసి... హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ల్యాండ్ సెటిల్మెంట్లు, బిజినెస్ లు చేసుకోరా... అని ప్రశ్నిస్తున్నారు.పుట్ట మహేష్ చేసిన పాపానికి పార్టీ అధినేతకు బాధ్యత లేదా ? అని నిలదీస్తున్నారు.

 

Published : 
  • 18 March 2026, 12:55 PM IST