సుప్రీం కోర్ట్ కు చేరిన లడ్డూ వ్యవహారం

తిరుమల లడ్డు వ్యవహారం సుప్రీం కోర్ట్ కు చేరింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులు వేర్వేరుగా పిల్స్‌ దాఖలు అయ్యాయి. సుబ్రహ్మణ్యస్వామి, వై.వి.సుబ్బారెడ్డి వేరు వేరు పిల్స్ దాఖలు చేసారు.

Post Published By: Vencateshg
Updated : 23 September 2024, 12:49 PM IST

తిరుమల లడ్డు వ్యవహారం సుప్రీం కోర్ట్ కు చేరింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులు వేర్వేరుగా పిల్స్‌ దాఖలు అయ్యాయి. సుబ్రహ్మణ్యస్వామి, వై.వి.సుబ్బారెడ్డి వేరు వేరు పిల్స్ దాఖలు చేసారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేసారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని స్వామి పిల్ దాఖలు చేసారు.

విచారణకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో గాని, నిపుణులతో కాని విచారణ చేయించాలన్ని వై.వి.సుబ్బారెడ్డి కోర్ట్ ని కోరారు. ఇక ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయింది. తిరుమలలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు. శాంతి హోమం నిర్వహించారు.

Published : 
  • 23 September 2024, 12:49 PM IST