తిరుమల లడ్డు కల్తీకి జగన్ కి సంబంధం లేదు. ఇది టీటీడీ బోర్డు కి సంబంధించిన వ్యవహారం. ఈ స్టేట్మెంట్ ఏపీ అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇచ్చినది. సభాముఖంగా జనసేన అధినేత, గత ముఖ్యమంత్రి కి క్లీన్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? లడ్డు కల్తీ తో జగన్ కి ఏ సంబంధం లేదు అంటే... అసలు ఈ వివాదమే లేదా? ఏపీలో ప్రజల్ని పార్టీలని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది పవన్ స్టేట్మెంట్. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు లడ్డు విషయంలో యూటర్న్ తీసుకున్నారు?
తిరుమల లడ్డూ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ…. అసెంబ్లీలో మాట్లాడిన డిప్యూటీ సీఎంపవన్ కళ్యాణ్… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేయకుండా… ఇది వ్యక్తుల సమస్య కాదు… వ్యవస్థలో జరిగిన లోపం అని మాట్లాడడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అన్ని పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సమయంలో… పవన్ వ్యక్తులను టార్గెట్ చేయకుండా వ్యవస్థ వైఫల్యంపై ఫోకస్ చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అన్న చర్చ జరుగుతోంది. లడ్డూ వివాదంలో బ్యాలెన్స్ గా మాట్లాడి జనసేన సేఫ్ జోన్‌లోకి వెళ్లిందా…? వైసీపీ సాఫ్ట్ టార్గెట్ నుంచి పవన్ బయటపడ్డారా…? అన్నది ఇప్పుడు హాట్ డిబేట్‌గా మారింది.
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపింది..ఆ టాపిక్ పై వైసీపీ,కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టి తప్పు మీదంటే మీది అని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ లో స్వల్పకాలిక చర్చ జరిగింది. లడ్డూ వివాదంలో అప్పటి వరకు పొలిటికల్ గా మంటలు చలరేగుతుండడంతో ఇంకేం ఉంది సభలో జనసేన టిడిపి బిజెపి వైసీపీ అధినేత జగన్ పై హీటెడ్ కామెంట్స్ చేస్తారు అనుకున్నారు అంత .. కానీ పవన్ అందుకు భిన్నంగా వ్యవహరించారు..
తిరుమల లడ్డు వ్యవహారాన్ని తెలివిగా హిందూ మతం వైపు చేశారు పవన్ కళ్యాణ్. లడ్డూ విషయంలో హిందువులు తమను తామే నిందించుకోవాలని ,మిగతా మతాలను చూసి హిందువులు నేర్చుకోవాలని, కులాల వారీగా హిందువులు విడిపోయారని విమర్శించారు.తిరుమల లడ్డూ వివాదం లో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కూటమిలో టీడీపీ, బీజేపీ లు, చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి వంటి నేతలు ఉన్నప్పటికీ… విపక్షాల విమర్శల బాణాలు ఎక్కువగా పవన్ వైపుకే మళ్లాయి. లడ్డు నెయ్యిలో పందికొవు కలిసిందని, జగన్ ఫ్యామిలీ ఏడుకొండలనీ, రెండు కొండలుగా మార్చాలని ప్రయత్నించిందని ఇలా రకరకాలుగా విమర్శిస్తూ వచ్చిన పవన్ హఠాత్తుగా తన వాయిస్ మార్చారు. లడ్డు కల్తీ తో జగన్ కి సంబంధం లేదని సర్టిఫికెట్ ఇవ్వడమే... వైసీపీని సైతం ఆశ్చర్యం లో పడేసింది.
వ్యక్తులపై ఆరోపణలు చేయకుండా… వ్యవస్థలో లోపాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పవన్ చేసిన వ్యాఖ్యలను రాజకీయ వర్గాలు కీలకంగా చూస్తున్నాయి.ఇప్పటి వరకు వైసీపీ నుంచి నేరుగా విమర్శలు ఎదుర్కొంటున్న పవన్… తాజా స్టేట్మెంట్‌తో ఆ పార్టీ అటాకింగ్ నుంచి బయటపడే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ ఇచ్చిన ఈ కంక్లూజివ్ స్టాండ్‌తో… లడ్డూ వివాదంలో వైసీపీ టార్గెట్ నుంచి కొంతవరకు బయటపడ్డట్టేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.మరో వైపు జగన్ తప్పు చేశాడు అని నేను ఎక్కడ చెప్పలేదు అనే స్టేట్మెంట్ పవన్ నోటి వెంట రావడంతో వైసిపి ఆయనకు టార్గెట్ చేయకపోవచ్చు. వ్యక్తులపై ఆరోపణలు చేయకుండా… వ్యవస్థ వైఫల్యంగా పేర్కొనడం ద్వారా… వైసిపి టార్గెట్ నుంచి పవన్ బయటపడ్డారు.