Samudrayaan: ఇవాళ చంద్రయాన్.. రేపు సముద్రయాన్‌.. 6 కి.మీల లోతు సాహసం.. భళా భారత్‌

సముద్రయాన్ అనేది తొలి సముద్రగర్భ మానవ సహిత యాత్ర. సముద్ర లోతుల్లోని వనరులు, జీవ వైవిధ్యం విశ్లేషణకు ఈ ప్రయోగాన్ని ఉపయోగిస్తామని కేంద్రం చెప్తోంది. లోతైన మహా సముద్ర మిషన్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 4 August 2023, 3:34 PM IST

Samudrayaan: చంద్రుడిపై అన్వేషణకు చంద్రయాన్ 3 ప్రాజెక్టును.. విజయవంతంగా అమలు చేసింది భారత్. ఇప్పుడు సముద్రయాన్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. సముద్రం అంతర్భాగంలో దాగి ఉన్న వనరులను గుర్తించేందుకు దీన్ని నిర్వహిస్తోంది. సముద్రంలో 6వేల మీటర్ల వరకు వెళ్లి వచ్చేలా సబ్ మెర్సిబుల్ వాహనాన్ని సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది.

సముద్రయాన్ అనేది తొలి సముద్రగర్భ మానవ సహిత యాత్ర. సముద్ర లోతుల్లోని వనరులు, జీవ వైవిధ్యం విశ్లేషణకు ఈ ప్రయోగాన్ని ఉపయోగిస్తామని కేంద్రం చెప్తోంది. లోతైన మహా సముద్ర మిషన్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బ్లూ ఎకానమీ విధానానికి సముద్రయాన్ ప్రాజెక్టు మద్దతుగా నిలుస్తుంది. అలాగే దేశ అభివృద్ధికి, జీవనోపాధికి, ఉద్యోగ కల్పనకు తోడ్పడుతుంది. 2026 నాటికి సముద్రయాన్ ప్రాజెక్టు సాకారం అవుతుందని కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు తెలిపారు. చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ దీన్ని అభివ‌ృద్ధి చేస్తోంది. సముద్రంలోకి పంపించనున్న సబ్ మెర్సిబుల్ వాహనానికి మత్స్య 6000గా పేరు పెట్టారు.

సముద్రయాన్ ప్రాజెక్టు సహా డీప్ ఓషన్ మిషన్‌కు.. ఐదేళ్లలో రూ.4,077 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేస్తే, సముద్రగర్భ శాస్త్రంలో టాప్‌లో ఉన్న దేశాలు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా సరసన భారత్ నిలవనుంది.

Published : 
  • 4 August 2023, 3:34 PM IST