అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు… వైభవ్ కు సైమన్ డల్ వార్నింగ్…!

భారత క్రికెట్‌లో అతి చిన్న వయసులోనే సంచలనాలు సృష్టిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ 2026లో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత సీజన్లో పరుగుల వరద పారిస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న వైభవ్ సూర్యవంశీ.

Post Published By: dialnews
Updated : 14 April 2026, 10:00 PM IST

భారత క్రికెట్‌లో అతి చిన్న వయసులోనే సంచలనాలు సృష్టిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ 2026లో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత సీజన్లో పరుగుల వరద పారిస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న వైభవ్ సూర్యవంశీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. అరంగేట్ర పేసర్ ప్రఫుల్ హింగే వేసిన బంతికి వైభవ్ సూర్యవంశీ ఔట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఒక్క వైఫల్యం తర్వాత వైభవ్ చుట్టూ ఉన్న పరిస్థితులపై న్యూజిలాండ్ మాజీ దిగ్గజం సైమన్ డల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఓ చర్చా కార్యక్రమంలో సైమన్ డల్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ప్లేయర్ల చుట్టూ తిరిగే మేనేజ్మెంట్ కంపెనీల గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఓ సూపర్ స్టార్ అయిపోయాడనీ,. భారత క్రికెట్‌లో వైభవ్ తదుపరి పెద్ద స్టార్ అవుతాడనడంలో సందేహం లేదన్నాడు. కానీ 15 ఏళ్ల వయసులో వచ్చే విపరీతమైన డబ్బు, కీర్తి ఎవరినైనా తప్పుదోవ పట్టించగలవన్నాడు.ముఖ్యంగా అతని చుట్టూ ఉండే వ్యక్తుల విషయంలో వైభవ్ చాలా అప్రమత్తంగా ఉండాలని మాజీ దిగ్గజం సైమన్ డల్ హెచ్చరించాడు.

చాలా మేనేజ్మెంట్ కంపెనీలు ఆటగాళ్ల కెరీర్ కంటే తమ లాభాలకే ప్రాధాన్యత ఇస్తాయని సైమన్ డల్ విమర్శించాడు. ఈ యువ ఆటగాడి ద్వారా ఎంత సంపాదించవచ్చు.. తమ కంపెనీకి ఎంత లాభం వస్తుందనేదే వారి ఆలోచనగా చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ కంపెనీలతో ఉన్న అతిపెద్ద సమస్య ఇదేననీ, వారు ఆటగాడిని కేవలం ఓ ఆదాయ వనరుగా చూస్తారు తప్ప, అతని కెరీర్‌ను ఎలా తీర్చిదిద్దాలి అనే దానిపై శ్రద్ధ పెట్టరని సైమన్ డల్ ఘాటుగా విమర్శించాడు.,వైభవ్ సూర్యవంశీ తన కెరీర్ సుదీర్ఘంగా సాగేలా చూసుకోవాలని.. కేవలం ప్రకటనల వెంట పడకూడదని సైమన్ డల్ సూచించాడు.

Published : 
  • 14 April 2026, 10:00 PM IST