ఇంగ్లాండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన భారత్, అదే రీతిన ముగించింది. టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత్, వన్డే సిరీస్‌ను సైతం 1-2 తేడాతో ఇంగ్లాండ్ చేతిలో పోగొట్టుకుంది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ గట్టి పునాది వేశారు.
గిల్ 53 బంతుల్లో, రోహిత్ 50 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత రోహిత్ 84 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. కీలక సమయంలో రోహిత్ ఔట్ కావడం భారత్‌కు దెబ్బకొట్టింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో భారత్ 7 వికెట్లకు 360 పరుగులకే పరిమితమై 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కరన్ 4 వికెట్లు తీసి భారత బ్యాటర్లను కట్టడి చేశాడు.