ఆల్ రౌండర్ లగ్జరీ లవ్ స్టోరీ.!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, డాషింగ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం, ప్రేమాయణాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియా

Post Published By: dialnews
Updated : 11 August 2026, 1:55 PM IST

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, డాషింగ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం, ప్రేమాయణాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో నిరంతరం సంచలనం సృష్టిస్తుంటాయి. గతంలో మోడల్, నటి నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకుని షాక్ ఇచ్చిన హార్దిక్, ఇప్పుడు మరోసారి తన పెళ్లి వార్తలతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు.ప్రముఖ మోడల్ మరియు నటి అయిన మహికా శర్మతో హార్దిక్ పాండ్యా త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అసలు వీరిద్దరి పరిచయం ఎలా మొదలైంది? గతంలో హార్దిక్ డేటింగ్ చేసిన అందగత్తెలు ఎవరు? తిరుమల శ్రీవారి దర్శనం వెనుక ఉన్న రహస్యమేంటి? ఆగస్ట్ నెలాఖరులో జరగబోయే పెళ్లి విశేషాలేంటి? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మొదట కలకత్తాకు చెందిన మోడల్ లిషా శర్మతో హార్దిక్ డేటింగ్ చేశారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత స్వీడిష్ నటి, మోడల్ ఎల్లి అవరామ్‌తో కలిసి వివిధ కార్యక్రమాల్లో కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. ఆ తదుపరి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఈషా గుప్తా, ఊర్వశి రౌతేలాలతో కూడా హార్దిక్ పాండ్యా ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.ఇవన్నీ పక్కన పెడితే, సెర్బియన్ నటి మరియు మోడల్ నటాషా స్టాంకోవిచ్‌తో సుదీర్ఘకాలం డేటింగ్ చేసిన హార్దిక్, ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 'అగస్త్య' అనే కుమారుడు ఉన్నాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట, ఊహించని విధంగా 2024 జూలైలో విడాకులు తీసుకుని వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నట్లు ప్రకటించి అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేశారు.

నటాషాతో విడాకుల తర్వాత బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో హార్దిక్ కొంతకాలం సన్నిహితంగా మెలిగినట్లు ప్రచారం జరిగింది. అయితే, అది తాత్కాలికమేనని తేలిపోయింది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా మోడల్, నటి అయిన మహికా శర్మతో సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మహికా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హార్దిక్ పాండ్యాతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తరచుగా పబ్లిక్ ఈవెంట్స్‌లో జంటగా కనిపించడం, హార్దిక్‌తో పాటు మహికా విదేశాలకు ప్రయాణించడం వీరి మధ్య ఉన్న బంధాన్ని స్పష్టం చేశాయి. టీ20 ప్రపంచకప్ సమయంలో టీమిండియా ఆడిన కీలక పోరుల్లో స్టేడియం గ్యాలరీలో మహికా శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి హార్దిక్‌ను ఉత్సాహపరిచింది. ఇటీవల వీరిద్దరికీ సీక్రెట్‌గా పెళ్లి జరిగిపోయిందంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అయింది.

ఒక ఫొటోలో మహికా నుదుట సిందూరంతో కనిపించగా, అందులో హార్దిక్‌తో పాటు ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఉన్నారు. అయితే ఈ ఫొటోపై హార్దిక్ గానీ, మహికా గానీ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇటీవల హార్దిక్ పాండ్యా, మహికా శర్మతో కలసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి గుండుతో ప్రత్యక్షమైన హార్దిక్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. త్వరలోనే మహికాను పెళ్లి చేసుకోబోతున్నారనే క్రమంలోనే శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడానికి హార్దిక్ తిరుమలకు వచ్చారంటూ వార్తలు గుప్పుమన్నాయి. హార్దిక్ పాండ్యా - మహికా శర్మ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో, వారి అభిమానులు నెట్టింట ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నిజంగానే ఆగస్ట్ నెలాఖరులో వీరు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారా? లేదా ఇది కూడా కేవలం గాసిప్ లేదా గాలివార్తగానే మిగిలిపోతుందా? అనేది త్వరలోనే తేలనుంది.

Published : 
  • 11 August 2026, 1:55 PM IST