ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా అడుగుపెడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు జట్టు ప్లేయర్లకు విరాట్ కోహ్లి గట్టి హెచ్చరిక చేశాడు. 18 ఏళ్లుగా టైటిల్ కోసం పోరాడుతూ, ఎంతో ట్రోలింగ్‌కి గురైన ఆర్సీబీ .. ఎట్టకేలకు 2025లో ట్రోఫీ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అయితే, ఇప్పుడే తమకు అసలు పరీక్ష మొదలైందని కోహ్లి చెప్పాడు..మొదటి ట్రైనింగ్ సెషన్‌లో కోహ్లీ మాట్లాడుతూ గత రెండు మూడు సీజన్లలో మేము చాలా కష్టపడ్డామనీ, కానీ ఇప్పుడు పరిస్థితి మరింత కఠినంగా ఉంటుందన్నాడు. ఎందుకంటే మిగతా జట్లు తమపై చాలా స్ట్రాంగ్‌గా అటాక్ చేస్తాయన్నాడు.
ఇప్పుడే ప్రతి సెషన్‌లో 120 శాతం ఇవ్వాలనీ, ఈ రెండు నెలలన్నరలో పూర్తిగా కట్టుబడి ఆడాలాంటూ జట్టును మోటివేట్ చేశాడు. గతంలో టైటిల్ కోసం పోరాడిన ఆర్సీబీ ఇప్పుడు ఛాంపియన్‌గా ఉండటంతో, ప్రతి మ్యాచ్‌లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించాడు.ఇదే సమయంలో జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తాము ఈసారి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్నామనీ, స్క్వాడ్‌ను మరింత బలంగా మార్చుకున్నామన్నాడు.
కొత్త ప్లేయర్లను టీమ్‌లో కలపడం కీలకమనీ,. ఈసారి మా జెర్సీపై స్టార్ ఉంది. అది గర్వకారణం. కానీ గత సీజన్ ముగిసిపోయింది. ఇప్పుడు కొత్త ఛాలెంజ్ ఉంది. మళ్లీ గెలవడమే మా లక్ష్యం” అని పేర్కొన్నాడు.ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్ ఆర్సీబీతోనే మొదలవ్వనుంది. మార్చి 28న డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ - సన్‌రైజర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. తొలి షెడ్యూల్‌లో ఆర్సీబీ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 10న రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 12 ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. తొలి రెండు మ్యాచ్‌లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆడనుండగా.. మిగతా రెండు మ్యాచ్‌లు గువాహటి, వాంఖడేలో ఆడనుంది.