20 ఓవర్లూ స్పిన్నర్లే వేశారు, టీ20ల్లో ఊహించని ఘటన

టీ20 క్రికెట్ లో ఊహించని పరిణామం ఒకటి జరిగింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఈ అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 20 ఓవర్లు స్పిన్ బౌలర్లే వేశారు.

Post Published By: Vencateshg
Updated : 27 January 2025, 6:32 PM IST

టీ20 క్రికెట్ లో ఊహించని పరిణామం ఒకటి జరిగింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఈ అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 20 ఓవర్లు స్పిన్ బౌలర్లే వేశారు. 140 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్స్ జట్టు ఐదుగురు స్పిన్నర్లచేత మొత్తం ఓవర్లు వేయించింది. జో రూట్ , దునిత్ వెల్లలాగే, జార్న్ ఫార్టుయిన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, న్కాబా పీటర్ తలో నాలుగు ఓవర్లు వేశారు.

పార్ట్ టైం బౌలర్ రూట్ కూడా నాలుగు ఓవర్ల కోటా బౌలింగ్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. విభాగాన్నే నమ్ముకొని పార్ల్ రాయల్స్ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. ప్రత్యర్థి జట్టును 129 పరుగులకే పరిమితం చేసి 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫ్రాంచైజీ టీ20 క్రికెట్ లో మొత్తం 20 ఓవర్లు స్పిన్నర్లు బౌలింగ్ చేసిన తొలి జట్టుగా పార్ల్ రాయల్స్ నిలిచింది.

Published : 
  • 27 January 2025, 6:32 PM IST