ఇంత బరితెగింపా ? హార్థిక్ కు కామన్ సెన్స్ లేదు…!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ అనంతరం చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.

Post Published By: dialnews
Updated : 10 March 2026, 5:32 PM IST

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ అనంతరం చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలిచిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విజయానంతరం భారత ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, భాగస్వాములు మైదానంలోకి అనుమతించారు.

ఆటగాళ్లంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ విజయాన్ని ఆస్వాదించారు. హార్దిక్ పాండ్యా కూడా తన పార్ట్‌నర్ మహికా శర్మ‌తో కలిసి ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఆమెతో కలిసి స్టెప్పులు వేసిన హార్దిక్.. ప్రపంచకప్‌తో కలిసి ఫోజిచ్చాడు. అంతటితో ఆగకుండా ఆమెను పలుమార్లు గట్టిగా హగ్ చేసుకుంటూ ముద్దుల వర్షం కురిపించాడు. కెమెరాలు, మైదానంలో జనాలు ఉన్నారనే సోయి లేకుండా హద్దులు ధాటి ప్రవర్తించాడు.

పోడియంపై హార్దిక్ పాండ్యా , మహికా శర్మ ఇద్దరూ పోడియంపై పడుకుని సెలబ్రేట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఆ సమయంలో హార్దిక్ పాండ్యా తన భుజాలపై భారత జాతీయ జెండాను చుట్టుకుని కనిపించాడు. అయితే ఈ చర్యపై కొంతమంది అభిమానులు విమర్శలు గుప్పిస్తూ జీరో సివిక్ సెన్స్ అంటూ ట్రోల్ చేశారు. ట్రోఫీ అందించిన పోడియంపై ఇద్దరు పడుకొని రొమాన్స్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ప్రియురాలు మహికా శర్మతో కలిసి హార్దిక్ బరితెగించిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటలో హార్దిక్ ఎంత తోపు అయినా.. పబ్లిక్ ప్లేస్‌లో ఎలా ప్రవర్తించాలనే మ్యానర్స్ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. హార్దిక్ ప్రవర్తన చిరాకు తెప్పిస్తుందని కామెంట్ చేశారు.తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత మహికా శర్మతో హార్దిక్ పాండ్యా సహజీవనం చేస్తున్నాడు.

హార్దిక్ పాండ్యా, మహికా శర్మ తమ రిలేషన్‌షిప్‌ను 2025 అక్టోబర్‌లో పబ్లిక్‌గా ప్రకటించారు. అప్పటి నుంచి ఇద్దరూ పలు పబ్లిక్ ఈవెంట్లలో, క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో కలిసి కనిపిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 సమయంలో కూడా మహికా శర్మ స్టేడియంలో కనిపిస్తూ పాండ్యాకు మద్దతుగా చీర్ చేసింది. అతని కుమారుడు అగస్త్యతో కూడా ఆమె సమయం గడిపిన సందర్భాలు కనిపించాయి. మహికా శర్మ రాకతో తన జీవితం మారిపోయిందని, ఆమె తన లక్కీ ఛార్మ్ అని కూడా హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. అయితే ఈ రిలేషన్ ఎన్ని రోజులో చూస్తామని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

Published : 
  • 10 March 2026, 5:32 PM IST