పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు భారత జట్టుకు కొత్త టెన్షన్ పట్టుకుంది. నమీబియాతో మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. ఆరంభంలో అదరగొట్టింది. అయితే నమీబియా బౌలర్లు మిడిల్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్ ఎరాస్మస్ తన వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్‌తో భారత బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్ చేసిన ఎరాస్మస్.. 7 రన్స్ మాత్రమే ఇవ్వగా.. ఆ ఓవర్లో టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. చివరి 2 ఓవర్లలో భారత్ 5 వికెట్లు కోల్పోయి 10 పరుగులు మాత్రమే చేయగలిగింది.నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 20 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. దీంతో ఎరాస్మస్ కంటే వైవిధ్యమైన స్లింగ్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ ఉండే పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు ఇబ్బంది పడతారేమో అనే అభిప్రాయం వినిపిస్తోంది.
మిగతా బౌలర్లకు భిన్నంగా తారిఖ్.. తన చేతిని అసాధారణంగా వంచి.. బంతిని వేయడానికి వచ్చి.. కాసేపు ఆగిన తర్వాత బాల్‌ను రిలీజ్ చేస్తాడు. దీంతో బంతిని అతడు ఎప్పుడు రిలీజ్ చేస్తాడు, ఆ బాల్ ఎక్కడ పడుతుంది, ఎటు వైపు స్పిన్ అవుతుందనేది తెలియక బ్యాట్స్‌మెన్ గందరగోళానికి గురవుతాడు. ఇటీవల అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అతడు 4 ఓవర్లలో 27 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. భారత్‌పైనా అతడు ప్రభావం చూపుతాడని భావిస్తున్నారు.అసలే కొలంబో పిచ్ స్పిన్‌కు ఎక్కువగా అనుకూలిస్తుంది. స్పిన్‌కు సహకరించే పిచ్ మీద మిస్టరీ బౌలర్‌ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కోవడానికి టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ సలహా ఇచ్చాడు.
గతంలో తన బౌలింగ్ యాక్షన్ సాధారణంగా ఉండి.. ఓవర్ చివరి బంతిని వేసేటప్పుడు మాత్రం.. సడెన్‌గా కాసేపు ఆగి బంతిని వేస్తే కొన్నేళ్ల క్రితం దాన్ని అక్రమంగా పరిగణించేవారని గుర్తు చేసుకున్నాడు. ఎందుకంటే అది తన బౌలింగ్ యాక్షన్ సహజమైన రిథమ్‌కు పూర్తిగా వ్యతిరేకమన్నాడు. అలాంటప్పుడు అంపైర్ నన్ను హెచ్చరించేందుకు వీలుందనీ,. అదే తారిఖ్ విషయానికి వస్తే.. ఆగి బౌలింగ్ చేయడం అనేది అతడి సాధారణ బౌలింగ్ యాక్షన్‌లో భాగమన్నాడు. . అయితే ఇదే సమయంలో అతణ్ని ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లకు ఓ సలహా కూడా ఇచ్చాడు. తారిఖ్ బంతిని విసరడానికి ముందు ఆగితే.. పక్కకు తప్పుకునే హక్కు బ్యాటర్‌కు ఉందన్నాడు. భారత బ్యాటర్లు ఈ టాక్టిక్‌ను ఉపయోగిస్తే.. అంపైర్‌ను ఒత్తిడికి లోనవుతాడనీ, దీంతో అతడు బౌలర్‌ను హెచ్చరించే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.