జాతీయ జెండా కప్పుకుని గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో స‌ర‌సాలు.. హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు…!

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో ప‌డ్డాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌రువాత జ‌రుపుకున్న సంబ‌రాల్లో పాండ్యా జాతీయ జెండాను అగౌరవపరిచారని పూణేకు చెందిన న్యాయ‌వాది వాజిద్ ఖాన్ ఆరోపించారు

Post Published By: dialnews
Updated : 13 March 2026, 1:15 PM IST

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో ప‌డ్డాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌రువాత జ‌రుపుకున్న సంబ‌రాల్లో పాండ్యా జాతీయ జెండాను అగౌరవపరిచారని పూణేకు చెందిన న్యాయ‌వాది వాజిద్ ఖాన్ ఆరోపించారు. ఈ మేర‌కు శివాజీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో పాండ్యాపై ఫిర్యాదు చేశారు.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. ఆ త‌రువాత హార్దిక్ పాండ్యా త‌న ఒంటికి జాతీయ జెండాను చుట్టుకుని క‌నిపించాడు. ఆ త‌రువాత త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ మ‌హికా శ‌ర్మ‌తో వేడుకలు చేసుకున్నాడు. ఇదే వివాదానికి కార‌ణ‌మైంది.

పాండ్యా త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో క‌లిసి మైదానంలో డ్యాన్స్‌లు చేశాడనీ,. ఆ స‌మ‌యంలో అత‌డు జాతీయ జెండాను ఒంటికి చుట్టుకుని ఉన్నాడనీ
వాజిద్ చెబుతున్నారు. 1971 నేష‌న‌ల్ ఫ్లాగ్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారం.. మనం జాతీయ జెండా గౌరవాన్ని గౌరవించాలనీ,. అయితే.. హార్దిక్ పాండ్యా తన విజయోత్సవ వేడుకలో మునిగిపోయాడనీ చెప్పారు. అతను తన స్నేహితురాలితో కలిసి జాతీయ జెండాను ధరించి వేదిక‌పై పడుకున్నాడనీ, ఇది జాతీయ జెండాకు అవమానమనీ వాజిద్ చెప్పుకొచ్చారు.

ఈ విష‌యంపై తాను శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాన‌ని తెలిపారు. కాగాఆటలో అద్భుతమైన ఆల్ రౌండర్ గా గుర్తింపు ఉన్న పాండ్యా తన ప్రవర్తనతో మాత్రం వివాదాల్లో నిలుస్తుంటాడు. ఇటీవల వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై విజయం తర్వాత తన గాళ్ ఫ్రెండ్ తో హార్థిక్ హద్దులు దాటి ప్రవర్తించాడు. ఏదో సినిమా షూటింగ్ లో హీరో హీరోయిన్లు రొమాంటిక్ సీన్స్ లో నటిస్తున్నట్టు ట్రోఫీ తీసుకున్న పోడియంపైనే ఆమెతో రొమాన్స్ చేశాడు. అసలు ఇంత బరితెగింపా అంటూ హార్థిక్ పాండ్యాపై అందరూ మండిపడ్డారు. భుజంపై జాతీయ జెండా ఉంచుకుని మరీ గాళ్ ఫ్రెండ్ మహికాతో రొమాన్స్ లో మునిగిపోయాడు. దీనిపైనే ఇప్పుడు వివాదం మొదలయింది.

Published : 
  • 13 March 2026, 1:15 PM IST