ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది… ఆర్సీబీ, సన్ రైజర్స్ మధ్య ఆరంభ మ్యాచ్…!

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.

Post Published By: dialnews
Updated : 12 March 2026, 6:00 PM IST

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 28 నుంచి ఈ ధనాధన్ లీగ్ మొదలవ్వనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌నే బీసీసీఐ విడుదల చేసింది.

బెంగళూరు, ముంబై, గువహటి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్‌ వేదికగా ఈ 20 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 03:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 07:30 గంటలకు ప్రారంభమవుతాయి.శనివారం ప్రారంభ మ్యాచ్ తర్వాత ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి.

ఏప్రిల్ 4న మొదటి డబుల్ హెడర్ జరగనుంది. మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్, రాత్రి గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి.బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌లకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. మార్చి 13న కమిటీ సభ్యులు చిన్నస్వామి స్టేడియాన్ని సందర్శించి, మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లపై మాక్ డెమో నిర్వహించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.

Published : 
  • 12 March 2026, 6:00 PM IST