టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్టులలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' ఒకటి. 'ఉప్పెన' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, 1980ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.రామ్ చరణ్‌కు 'RRR' తర్వాత గ్లోబల్ స్థాయిలో ఏర్పడిన గుర్తింపు 'పెద్ది' సినిమా ఓపెనింగ్స్‌పై విపరీతమైన ప్రభావం చూపనుంది. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల నుండి 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో రామ్ చరణ్ క్రేజ్‌కు తోడు, బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్ తోడైతే మొదటి రోజే రెండు రాష్ట్రాల్లో కలిపి 60 నుంచి 70 కోట్ల షేర్ వసూలు చేయడం సులభమని విశ్లేషకులు చెబుతున్నారు.
రామ్ చరణ్ కు అమెరికా మార్కెట్లో ఉన్న పట్టు గురించి తెలిసిందే. అక్కడ కేవలం ప్రీమియర్ షోల ద్వారానే 3 టూ 4 మిలియన్ డాలర్ల మార్కును ఈ సినిమా అందుకునే ఛాన్స్ ఉంది.ఈ సినిమా సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఇప్పటికే నాన్-థియేట్రికల్ హక్కులు ద్వారా దాదాపు 275 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందంటే ఈ సినిమాపై ఉన్న నమ్మకం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్ కానుంది. ఇప్పటికే విడుదలైన 'చిక్రి చిక్రి' మరియు 'రయ్ రయ్ రా రా' సాంగ్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
ఉత్తరాంధ్ర యాస, సంస్కృతిని బుచ్చిబాబు ఎంత సహజంగా చూపిస్తారో 'ఉప్పెన'తో రుజువైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తుండటం మాస్ ఆడియన్స్‌లో పూనకాలు తెప్పిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ కావడంతో పాటు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించడం ఈ సినిమాకు పాన్-ఇండియా అప్పీల్‌ను తెచ్చింది.మొత్తానికి 'పెద్ది' సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవడమే కాకుండా, లాంగ్ రన్లో 1000 కోట్ల క్లబ్లో చేరే సత్తా ఉందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఏప్రిల్ 30న థియేటర్ల వద్ద మెగా సునామీ ఖాయంగా కనిపిస్తోంది.