రెస్ట్ ఇచ్చారా.. తప్పించారా ? సంజూ ఫ్యూచర్ పై గందరగోళం..!

భారత క్రికెట్ జట్టులో కొంతకాలంగా ప్రతీ ప్లేస్ కోసం కనీసం నలుగురైదుగురు పోటీ పడుతున్నారు. ఓపెనర్ నుంచి బౌలర్ వరకూ అన్నింటా తీవ్రమైన పోటీ నెలకొంది.

Post Published By: dialnews
Updated : 9 July 2026, 3:30 PM IST

భారత క్రికెట్ జట్టులో కొంతకాలంగా ప్రతీ ప్లేస్ కోసం కనీసం నలుగురైదుగురు పోటీ పడుతున్నారు. ఓపెనర్ నుంచి బౌలర్ వరకూ అన్నింటా తీవ్రమైన పోటీ నెలకొంది. అవకాశాలు దక్కించుకున్న ఆటగాళ్లు నిలకడగా రాణించకుంటే మాత్రం వేటు వేసేందుకు సెలక్టర్లు మాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే అవకాశాల కోసం చాలా మంది ఎదురుచూస్తుండడమే దీనికి కారణం. అయితే హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ఈ సంప్రదాయం మరింత పెరిగింది. సీనియర్ల నుంచి యువ ఆటగాళ్ళ వరకూ ఎవరినైనా తప్పించేందుకు గంభీర్ ఏమాత్రం వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే జింబాబ్వే టూర్ కు సంజూ శాంసన్ ను తప్పించినట్టు తెలుస్తోంది.

ఐర్లాండ్ సిరీస్ లోనూ, ఇంగ్లాండ్ తో తొలి టీ20లో విఫలమవడంతో సంజూను తప్పించి చిచ్చర పిడుగు వైభవ్ కు అవకాశమిచ్చారు. ఇప్పుడు మూడో టీ20లోనూ సంజూను పక్కన పెట్టారు. అలాగే జింబాబ్వే టూర్ కు సైతం ఎంపిక చేయలేదు. దీనిపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీసీఐ సెలక్టర్లు మాత్రం రెస్ట్ ఇచ్చామని చెబుతున్నా వైభవ్ సూర్యవంశీ క్లిక్ అయితే మాత్రం సంజూ శాంసన్ కెరీర్ ముగిసినట్టేనని కొందరు అభిప్రాయపడుతున్నారు..అయితే మరికొందరు మాత్రం ఈ అభిప్రాయం సరికాదంటున్నారు. 2026 టీ20 ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన సంజూను రెండు, మూడు వైఫల్యాలకే పక్కన పెట్టడం తప్పిదమే అవుతుందన్నది కొందరు మాజీల వాదన. పైగా సెలక్టర్లు సంజూను 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

జింబాబ్వే టూర్ కోసం ఎంపిక చేసిన జట్టుకు సంబంధించి విమర్శలకు బీసీసీఐ కూడా స్పంచించింది. జింబాబ్వే పర్యటనకు సంజూను తొలగించలేదని, యువ వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను పరీక్షించేందుకే అతనికి విశ్రాంతినిచ్చామని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. చిన్న సిరీస్‌కు ఇద్దరు సీనియర్ వికెట్ల కీపర్ల అనవసరమని భావించే సంజూకు రెస్ట్ ఇచ్చినట్టు వెల్లడించాడు.2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని, రాబోయే వన్డే సిరీస్‌లలో సంజూకు రెగ్యులర్ అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. కేవలం టీ20లకే కాకుండా, వన్డే ఫార్మాట్‌లోనూ సంజూ శాంసన్ ఆటతీరుపై గంభీర్ నమ్మకంగా ఉన్నాడని తెలుస్తోంది. .సంజూను ప్రపంచకప్ ప్రణాళికలకు అనుగుణంగానే కొన్ని సిరీస్ లకు విశ్రాంతి కల్పిస్తున్నట్టు బోర్డు వర్గాల సమాచారం.

Published : 
  • 9 July 2026, 3:30 PM IST