Ex-CM KCR's bus trip.. Road show.. Ex-CM of Telangana is campaigning on the path of AP CM Jagan
కేసీఆర్ తెలంగాణ ఉద్యమ రథసారథి.. తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించిన TRS - BRS పార్టీ అధినేత.. తెలంగాణ మొదటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. గతంలో ఎప్పుడు చేయని ప్రచారం కు సిద్దం అవుతున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఘోర పరాజయం మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ సత్తా చాటాలి కంకణం కట్టుకుంది. అధికారం పోయిన బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అన్న సంకేతాలను నిత్యం ప్రజల్లోకి పంపిస్తున్నే ఉన్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు.
దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటికాలితో కేసీఆర్ ఎన్నికల ప్రచారం జరుపుతునే ఉన్నారు. ప్రజా ఆశిర్వాద సభలతో అధికా పార్టీకి పంచుల వర్షం కురిపిస్తునే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంవత్సర లోగా పడిపోతుంది అని.. తాము ముట్టుకోకుండానే ప్రభుత్వం పడిపోతుంది. సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముందు ముందు 2001 -2014 వరకు ఉన్న ఉద్యమ కేసీఆర్ (KCR) ను చూడబోతున్నారని రాష్ట్ర ప్రజలకు చేప్పుకోచ్చారు.
అక్కడితో ఆగకుండా ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని.. ఎన్నికల వరకు నిత్యం ప్రజల్లో ఉండాలి.. ఏకంగా ఆంధ్రాలో సీఎం వైఎస్ జగన్ (CM Jagan) మాదిరి.. బస్సు యాత్రను చేపట్టనున్నారు. బస్సు యాత్రకు సర్వం సిద్ధం అన్నట్లుగా.. అన్ని కార్యక్రమాలు కూడా చకచక అపోయాయి. ఇక పోతే పార్లమెంట్ ఎన్నికలకు 3 వారాలు సమయం మాత్రమే ఉంది. దీంతో బస్సు యాత్ర చేస్తే.. అక్కడే రోడ్ షోలు.. భారీ బహిరంగ సభలో ప్రజలను ఓటర్లను.. మరింత ప్రసన్నం చేసుకునేందుకు సమయం ఉంటుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈనెల 24న నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుండగా.. మే 10న సిద్ధిపేట బహిరంగ సభతో యాత్ర ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ తొలిసారిగా బస్సు యాత్ర చేస్తున్నారు.
విడుదలైన బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ రోడ్ షోల షెడ్యూల్ 👇
SSM