KTR,  MP : ఎంపీగా కేటీఆర్‌.. పోటీ ఎక్కడి నుంచి అంటే..

తెలంగాణలో ఊహించని పరాజయాన్ని అందుకున్న బీఆర్ఎస్‌ పార్టీ.. త్వరలో రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు రెడీ అవుతోంది. అందుకోసం పార్లమెంట్ నియోజకరవ్గాలవారీగా ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఈసారి బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. పార్లమెంట్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండగా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్‌కు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 January 2024, 3:09 PM IST

Published : 
  • 7 January 2024, 3:09 PM IST

Exit mobile version