Top story: నేపాల్ లో భారత్ మరో దారుణమైన ఆపరేషన్.. ఆ 19 మంది టీం ఏం చేస్తున్నారు.? వింటేనే చెమటలు పడతాయి..!

టిబెట్-నేపాల్ సరిహద్దులను అతలాకుతలం చేసిన భయంకరమైన జలప్రళయం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ మహా విపత్తులో ఇప్పటివరకు 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 4,000 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు.

Post Published By: dialnews
Updated : 4 September 2026, 9:20 PM IST

టిబెట్-నేపాల్ సరిహద్దులను అతలాకుతలం చేసిన భయంకరమైన జలప్రళయం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ మహా విపత్తులో ఇప్పటివరకు 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 4,000 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. అయితే ప్రస్తుతం అక్కడ ఊహించని రీతిలో మరో గుండెలవైసే సంక్షోభం మొదలైంది. వరదల్లో కొట్టుకువచ్చిన వందలాది మృతదేహాలు పూర్తిగా కుళ్ళిపోయి, శరీర భాగాలు ఛిద్రమై అస్సలు గుర్తుపట్టలేనంత దారుణంగా మారాయి.

శ్మశానాలు, మార్చురీలు శవాల దిబ్బలుగా మారడంతో.. వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పేర్లు, గుర్తింపు లేకుండానే వాటిని సామూహిక సమాధులలో పూడ్చిపెడుతున్నారు. మరి ఇలాంటి స్థితిలో చనిపోయిన వారు ఎవరో ఎలా గుర్తిస్తారు? వారిని సొంత కుటుంబాలకు ఎలా చేరుస్తారు? ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌కు సహాయం చేయడానికి మన భారత ఫోరెన్సిక్ నిపుణులు ఎలా రంగంలోకి దిగారు?

ఈ వరద ముంచెత్తిన భోటెకోశి-త్రిశూలి లోయలో ప్రస్తుతం ఎటు చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. స్థానికులు, పర్యాటకులు, మరియు భారీ సంఖ్యలో ఉన్న భారతీయుల మృతదేహాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి మార్చురీలలో పేరుకుపోయాయి. కేవలం ఒకే ఒక్క రోజు ఆగస్టు 30న నేపాల్‌కు దాదాపు 650 మృతదేహాలు లభించగా.. అందులో కేవలం 27 బాడీలను మాత్రమే బంధువులు గుర్తుపట్టగలిగారు. మిగిలిన వందలాది శవాలు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయంటే, కనీసం అవి ఎవరివో గుర్తుపట్టడం కుటుంబ సభ్యుల వల్ల కాలేదు.

చిత్వాన్ ప్రాంతంలో దొరికిన 699 మృతదేహాల అవశేషాలలో 211 బాడీలు పూర్తిగా ముక్కలైపోయాయి. సాధారణంగా శవాలను గుర్తించిన తర్వాతే అంత్యక్రియలు చేయడం సాంప్రదాయం. కానీ ఇక్కడ శవాలు కుళ్ళిపోతూ భయంకరమైన వాసన వస్తుండటంతో.. "ముందు శవాలను పూడ్చండి.. సాక్ష్యాలను భద్రపరచండి.. గుర్తింపు ప్రక్రియ మెల్లగా చేద్దాం" అనే పాలసీని నేపాల్ అధికారులు అమలు చేస్తున్నారు. తెల్లటి గుడ్డలలో చుట్టి వీటిని సామూహిక సమాధులలో ఉంచుతున్నారు.

ఇలాంటి అత్యంత క్లిష్టమైన, గంభీరమైన పరిస్థితుల్లో నేపాల్ ప్రభుత్వం అధికారికంగా భారతదేశ సాంకేతిక సహాయాన్ని కోరింది. దాంతో భారత్ తక్షణమే స్పందించి 19 మంది అత్యున్నత ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని నేపాల్‌కు పంపించింది. ఈ భారత ఫోరెన్సిక్ టీమ్ ప్రస్తుతం నేపాల్ పోలీస్ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ మరియు ఖుమల్తార్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో రాత్రింబగళ్లు శ్రమిస్తోంది. ముఖాలు, శరీరాలు పూర్తిగా పాడైపోయినందున.. ఈ నిపుణులు మృతదేహాల తొడ ఎముకలు లేదా పళ్ల నుంచి టిష్యూ మరియు బోన్ శాంపిల్స్‌ను సేకరిస్తున్నారు.

తమ వారు కనిపించకుండా పోయారని ఏడుస్తూ వస్తున్న బంధువుల నుంచి బుక్కల్ స్వాబ్స్ మరియు బ్లడ్ శాంపిల్స్‌ను తీసుకుంటున్నారు. వీటి ద్వారా డీఎన్ఏ ప్రొఫైలింగ్ తయారు చేసి, ఆ శవాల డీఎన్ఏతో మ్యాచ్ చేసే లాబొరేటరీ ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ డీఎన్ఏ మ్యాచింగ్ ప్రక్రియ చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా సాగుతుంది. కనీసం ఇద్దరు స్వతంత్ర ఫోరెన్సిక్ అనలిస్టులు ఈ డీఎన్ఏ మ్యాచ్ అయిందని ధృవీకరించిన తర్వాతే.. సదరు వ్యక్తి వివరాలను జిల్లా అధికారులకు లేదా భారత ఎంబసీకి తెలియజేస్తారు.

ఆ తర్వాతే ఆయా మృతదేహాలను సామూహిక సమాధుల నుంచి వెలికితీసి, వారి వారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేయడం లేదా ఇండియాకు తరలించడం వంటివి చేస్తారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన రాజకీయ పరిణామం కూడా జరిగింది. నిరంతరం భారత్‌పై విమర్శలు చేసే నేపాల్ ప్రధాని బాలెన్ షా, ఈ విపత్తు రాగానే మొదట భారత సహాయాన్ని నిరాకరించినప్పటికీ.. పరిస్థితి చేతులు దాటిపోవడంతో తక్షణమే యూటర్న్ తీసుకుని ఢిల్లీ సహాయాన్ని అర్ధించారు.

భారత్ నుంచి టన్నెల్ టీమ్స్, రెస్క్యూ టీమ్స్ మరియు ఫోరెన్సిక్ టీమ్స్ వెళ్లిన తర్వాతే అక్కడ సహాయక చర్యలు ఒక ట్రాక్‌లోకి వచ్చాయి. కళ్ళముందే తమ వారు చనిపోయినా.. కనీసం ఆ శవం ఎక్కడుందో తెలియక, గుర్తుపట్టలేక వేలాది కుటుంబాలు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైన్స్ మరియు ఫోరెన్సిక్ టెక్నాలజీ మాత్రమే ఆ అభాగ్యులకు ఒక పేరును, వారి కుటుంబాలకు ఒక ఉపశమనాన్ని ఇవ్వగలవు. మన దేశానికి చెందిన 19 మంది ఫోరెన్సిక్ హీరోలు అక్కడ ప్రాణాలకు తెగించి, కుళ్ళిన శవాల మధ్య ఉంటూ చేస్తున్న ఈ సేవ నిజంగా అభినందనీయం.

Published : 
  • 4 September 2026, 9:20 PM IST