Manchu Family: ఇదేనా మీ పెంపకం మోహన్ బాబు గారూ..?

క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకున్న మోహన్ బాబు ఇంట్లోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం మరింత వివాదాస్పదమవుతోంది. ఈ సంఘటనపై మోహన్ బాబు ఎలా రియాక్ట్ అవుతారనేదానిపై ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Post Published By: Raju Cln
Updated : 24 March 2023, 11:57 AM IST

మంచు ఫ్యామిలీకి సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సినీ ఇండస్ట్రీ పెద్దలలో మోహన్ బాబు ఒకరు. ఆయన క్రమశిక్షణకు మారు పేరుగా భావిస్తుంటారు. ఇండస్ట్రీలో కూడా అందరూ తనలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటారాయన. టాలీవుడ్ తనను పెద్దగా గుర్తించాలని, తాను పెదరాయుడిననేది ఆయన ఫీలింగ్. అడపాదడపా సినీ వేడుకలకు హాజరయ్యే ఆయన తన ఆవేదనను వెళ్లగక్కుతూ ఉంటారు. ఎవరు లెజెండ్ అనే అంశంపై అప్పట్లో పెద్ద వివాదానికే కారణమయ్యారాయన. అయితే ఇప్పుడు ఆయన కుటుంబమే క్రమశిక్షణ లోపించి వీధిన పడింది.

మంచు మోహన్ బాబుకు ఇద్దరు కుమారులు. మంచు విష్ణు, మంచు మనోజ్. మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్-మా కు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇద్దరు కొడుకులు హీరోలుగా పరిచయమైనా పెద్దగా సక్సెస్ లు లేక, సినిమాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక మనోజ్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా కుటుంబంలో విభేదాలు బయటికొచ్చాయి. అసలు ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టంలేదనే వార్తలొచ్చాయి. ఆయన పెళ్లి రాకపోవచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే మోహన్ బాబు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే అన్న మంచు విష్ణు ఫ్యామిలీ మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.

అయితే ఇప్పుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో సంచలనం కలిగిస్తోంది. తన అనుచరుడిపై మంచు విష్ణు దాడి చేశాడంటూ ఒక వీడియోను మంచు మనోజు పోస్ట్ చేశాడు. ఇలాంటివి మంచు విష్ణుకు మామూలే అని కూడా చెప్పాడు. మనోజ్ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వరకూ వెళ్లింది. అయితే మా అధ్యక్షుడిగా ఉన్న విష్ణు.. ఇలాంటి చిల్లర పనులు చేయడమేంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఎంతో గుర్తింపు ఉంది. దాన్ని కళాకారులందరూ ఎంతో గౌరవిస్తారు. అలాంటి గౌరవప్రదమైన సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న విష్ణు వ్యవహార శైలి ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.

క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకున్న మోహన్ బాబు ఇంట్లోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం మరింత వివాదాస్పదమవుతోంది. ఈ సంఘటనపై మోహన్ బాబు ఎలా రియాక్ట్ అవుతారనేదానిపై ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Published : 
  • 24 March 2023, 11:57 AM IST