భర్తకు దుబాయ్‌లో ఉద్యోగం.. లక్షకు పైగా జీతంతో ఆమెకు ఐటీ జాబ్.. బంగారంలాంటి ఇద్దరు పిల్లలు.. ఆర్థికంగా ఇబ్బందులు లేవు.. మరి ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో.. ఇద్దరు పిల్లలను గుండెలకు హత్తుకొని గూడ్స్ రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది. చర్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. సూసైడ్‌కు ముందు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన.. తల్లీపిల్లల విజువల్స్.. ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ఆగకుండా చేస్తోంది. చెంగిచెర్లకు చెందిన విజయారెడ్డి.. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త సురేందర్‌రెడ్డి దుబాయిలో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. వీళ్లకు కూతురు చేతనరెడ్డి, కుమారుడు విశాల్‌రెడ్డి ఉన్నారు. జనవరి 30న కొడుకు, కూతురును హాస్టల్ నుంచి తీసుకొచ్చిన విజయారెడ్డి.
రాత్రి పదకొండున్నరకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ప్లాట్‌ఫాం దాటి దాదాపు నాలుగు కిలోమీటర్లు నడుస్తూ వెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఇద్దరు పిల్లలను గుండెలకు హత్తుకుని.. గూడ్స్ రైలు కింద పడింది విజయారెడ్డి. ఎందుకు చనిపోయిందో తెలియడం లేదు.. తాను మాత్రమే కాకుండా పిల్లలను ఎందుకు బలి తీసుకుందో అర్థం కావడం లేదు. ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరి మనసు మెలేస్తోంది. తల్లీపిల్లల మరణంపై రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయ్. విజయారెడ్డి ఫోన్‌కు ఓ వ్యక్తి నుంచి.. సారీ మేడం మరోసారి తప్పు చేయను అనే మెసేజ్ కనిపించింది.
దీంతో ఆమెకు ఆఫీస్‌లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఇక విజయారెడ్డి కారు పార్కు చేసిన తర్వాత.. చర్లపల్లి రైల్వే టర్మినల్‌లో గంటపాటు పిల్లలలో గడిపినట్లు తెలుస్తోంది. 9వ నంబరు ప్లాట్‌ఫాంపై ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కెమెరాలో కనిపించాయ్. కారులో లభించిన పార్కింగ్ స్లిప్ వెనక.. విజయారెడ్డి రాసిన సూసైడ్ నోట్ కనిపించింది. తన చావుకు ఎవరూ కారణం కాదని.. జీవితం భారంగా ఉందని.. ఇష్టం లేని జీవితం గడపాలని లేదని రాసి ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరుగుతుందో.. తల్లి అలా ఎందుకు చేస్తుందో అర్థం అయ్యే లోపు.. ఆ పిల్లలు చనిపోయి ఉంటారు. ఈ ఆలోచనే ఇప్పుడు ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. చనిపోవడానికి ముందు ఆ పిల్లలు ఏం చేసి ఉంటారు..
ఆ తల్లికి ఎలా నచ్చచెప్పాలని ప్రయత్నించి ఉంటారో ఊహించుకుంటేనే.. గుండె తరుక్కుపోతుంది. ఎన్నో సందేహాలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయ్. ఇంత రాత్రి స్టేషన్‌కు ఎందుకొచ్చాం.. అసలు ట్రాక్ పక్కన ఎందుకు నడుస్తున్నామని వాళ్లు కచ్చితంగా ప్రశ్నించే ఉంటారు. ఇంటర్ చదువుతున్న పిల్లలు.. గట్టిగా అనుకుంటే వాళ్లకు ఉన్న బలంతో తల్లిని పక్కకు లాగేసి ఉండగలరు. కానీ అలా చేయలేదు. తల్లి గుండెలకు హత్తుకునే చావును ఆహ్వానించారు. అసలు పిల్లలకు ఏం చెప్పి ఆ తల్లి ఆత్మహత్యకు ఒప్పించి ఉంటుంది.. కారణం ఏమై ఉంటుందనే ప్రశ్న.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వెంటాడుతోంది.
ఆర్థిక కష్టాలు లేవు.. భార్యభర్తల మధ్య గొడవలు కూడా లేవు. అయినా సరే ఎందుకింత అఘాయిత్యం చేసినట్లు ! తల్లిదండ్రుల మధ్య సయోధ్య కుదర్చాలని ఆ పిల్లలు కూడా అనుకొని ఉంటారు కదా !
విజయారెడ్డి ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌కు అర్థమేంటి.. సారీ మేడమ్ ఇంకోసారి తప్పు జరగదనే మాటలను ఎలా అర్థం చేసుకోవాలి.. ఎవడో చేసిన తప్పుకు తాను ఆత్మహత్య చేసుకుందా.. అసలు పిల్లలు కూడా ప్రాణాలతో ఉండొద్దని ఎందుకు అనుకుంది... ఇవే ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని వెంటాడుతున్నాయ్. ఇంటర్మీడియట్ చదవుతున్న పిల్లలు.. భవిష్యత్ గురించి ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు.. ఎన్ని కలలు కని ఉంటారు.
గంటన్నరలో వాళ్లను ఎలా ఆత్మహత్యకు ఒప్పించగలిగింది.. చనిపోవడానికి అంత బలమైన కారణం ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. తను చనిపోవడమే కాదు.. పిల్లలను చంపడం దారుణం. చావాలి అనుకుంటే కారణాలు లక్ష ఉంటాయ్. బతకడానికి మాత్రం కారణం ఒకటే ఉంటుంది... అదే మనం మనుషులం కాబట్టి. ఆత్మహత్య చేసుకోవడం నేరమే కాదు.. పాపం. మతాలు చెప్పినా.. సైన్స్ చెప్పినా.. ఇదే నిజం. కడుపున పుట్టిన పాపానికి ఎదిగిన పిల్లల జీవితం నలిపేసిందా తల్లి. ఇంత నిరాశ నిస్పృహలు ఎందుకు.. బతుకంటే పోరాటం.. ఈరోజు బాగుండకపోవచ్చు.. రేపు కూడా కష్టంగా కనిపించొచ్చు.. ఎల్లుండి మాత్రం కచ్చితంగా బాగుంటుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు.. కష్టం తర్వాత సుఖం .. చీకటి తర్వాత వెలుగు. ఈ జీవన సూత్రాన్ని ఎందుకు మరచిపోతున్నారు.. ఇవే ప్రశ్నలు చర్లపల్లి ఘటన తర్వతా ప్రతీ ఒక్కరిలో ...!