Top story: సానుభూతి లేదు…ఎవరు చాన్స్ ఇవ్వడం లేదు. కొండా ఫ్యామిలీ ఎందుకిలా మిగిలిపోయింది.?

తెలంగాణలో తాము బీసీలకు ప్రతినిధులం అని చెప్పుకుంటారు కొండా మురళి, కొండా సురేఖ.... వారి కుమార్తె సుస్మిత. అదేం విచిత్రమో ..... కొండా సురేఖను మంత్రివర్గం నుంచి పీకేస్తే తెలంగాణలో ఎక్కడ ధర్నాలు జరగలేదు.

Post Published By: dialnews
Updated : 8 September 2026, 11:06 AM IST

తెలంగాణలో తాము బీసీలకు ప్రతినిధులం అని చెప్పుకుంటారు కొండా మురళి, కొండా సురేఖ.... వారి కుమార్తె సుస్మిత. అదేం విచిత్రమో ..... కొండా సురేఖను మంత్రివర్గం నుంచి పీకేస్తే తెలంగాణలో ఎక్కడ ధర్నాలు జరగలేదు. ఆందోళనలు జరగలేదు. ఎవరు కిరసనాయిలు డబ్బాలు పట్టుకొని ఆత్మహత్యలకు పాల్పడలేదు. బీసీలు ఎవ్వరు రోడ్డు ఎక్కలేదు. కనీసం 10 మంది బీసీలు ఒక సదస్సు పెట్టి మా బీసీ బిడ్డని ఇలా చేస్తారా అది కూడా ప్రశ్నించలేదు .మొత్తం బీసీల సంగతి అలా వదిలేద్దాం.... కనీసం పద్మశాలీలు, లేదా మున్నూరు కాపుల నుంచి అయినా ఓ 100 మంది రోడ్డు ఎక్కి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ కోసం ఆందోళన చేసిన సంఘటన లేదు. అంటే కొండా సురేఖ కోసం బీసీలు ఎవరు స్పందించడం లేదా? బీసీల్లో ఆమెకు పట్టు లేదా?

మొత్తం మీద జనం కొండా సురేఖ రాజీనామాని లైట్ తీసుకున్నారు. అదేదో పొలిటికల్ వ్యవహారంగా భావిస్తున్నారు.ప్రజా జీవితాలకు ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారంగా జనం అనుకుంటున్నారు. ఒక కొండా సురేఖ విషయంలోనే కాదు గతంలో ఉపముఖ్యమంత్రి రాజయ్యని కెసిఆర్ బర్తరఫ్ చేసినప్పుడు, హరీష్ రావుకు మంత్రి పదవి నిరాకరించినప్పుడు, ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించినప్పుడు ఎప్పుడు జనం మాట్లాడలేదు. స్పందించరు కూడా. దీనికి కారణం పొలిటికల్ లీడర్లు అంటే జనానికి ఒక రకమైన అసహ్యం. ఎలక్షన్స్ అయిపోయాక అది మా వ్యవహారం కాదు అనే భావన. ఇప్పుడు కొండ సురేఖ విషయంలో కూడా అంతే జరిగింది. బీసీలే కాదు ఎవరు స్పందించలేదు. దీనికి ప్రధాన కారణం కొండా మురళి కొండా సురేఖ బ్యాగ్రౌండ్. దందాలు, సెటిల్మెంట్లతో తోనే సురేఖ మురళి పాపులర్ అయ్యారు. ఏ పార్టీలోనూ వాళ్ళు నిలకడగా ఉండరు. రాజీనామా చేయడానికి వ్యక్తిగత కారణాలే తప్ప ప్రజా సమస్యలు కారణం కాదు. దాంతో కొండా సురేఖకు పెద్ద సానుభూతి రాలేదు.

ఇక వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్తారు అన్నది పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ ను వదిలి ఏదో ఒక పార్టీలో చేరాల్సిందే. అయితే బి.ఆర్.ఎస్ ముందుగానే సురేఖ కి దండం పెట్టేసింది . కేటీఆర్ పరువు ని రోడ్డుపైకి ఈడ్చిన సురేఖకి మళ్లీ పార్టీలో స్థానం ఉండదని టిఆర్ఎస్ నేతలు క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు.ఇక బిజెపి కూడా.... మా పార్టీ డంపింగ్ యార్డ్ కాదు.. ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేరడానికి అని కరాకండిగా చెప్పేసింది. పరిస్థితి చూస్తుంటే కొండా సురేఖని చేర్చుకోవడానికి తెలంగాణలో ఏ పార్టీ ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం కొండ ఫ్యామిలీ అంటే పెద్ద న్యూసెన్స్ అని అందరికీ తెలుసు. కొండ మురళి ని ,సురేఖని, సుస్మిత ని పార్టీలోకి తెచ్చి పెట్టుకోవడం అంటే కొరివితో తల గోక్కున్నట్టేనని అందరూ భావిస్తున్నారు. ఇక కొండ ఫ్యామిలీకి ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ తెలంగాణలో జనసేన. ఒకవేళ జనసేన సురేఖకి ఫ్యాన్స్ ఇచ్చిన తెలంగాణలో పార్టీని మోయాల్సిన బాధ్యత కొండ ఫ్యామిలీ నెత్తికెత్తుకోవాలి. కొండా సురేఖ కి బదులుగా ముగ్గురు బీసీ మహిళలకు పదవులు ఇవ్వడంతో సురేఖ బీసీల్లో కూడా సానుభూతి కరువైంది. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. కూతురు సుస్మిత వల్లే ఈ దుస్థితి వచ్చిందని కొండ ఫ్యామిలీ కింద మీద పడుతుంది.వేరే పార్టీలో అవకాశం ఉండి ఉంటే.... మంత్రి పదవి పోయిన మరుక్షణం లో రాజీనామా చేసి సురేఖ కొత్త చోటు వెతుక్కునేది.
అంతేకాదు అవసరం అయితే మళ్లీ ఎలక్షన్లో పోటీ చేసి.... నిత్యం కాంగ్రెస్ ని దుమ్మెత్తి పోయాలనేది ఆమె వ్యూహం. ఆ అవకాశం లేదని తేలిపోవడంతో ప్రస్తుతానికి నిశ్శబ్దంగా ఇంటికి పరిమితమయ్యారు ఆమె.

 

 

Published : 
  • 8 September 2026, 11:06 AM IST