బ్రేకింగ్: ఢిల్లీ చంద్రబాబు, కారణం అదే…?

ఏపీ సిఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 7న ఢిల్లీకి సిఎం చంద్రబాబు వెళ్ళే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు ప్రకటించాయి. ప్రధాని మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

Post Published By: Vencateshg
Updated : 3 October 2024, 12:08 PM IST

ఏపీ సిఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 7న ఢిల్లీకి సిఎం చంద్రబాబు వెళ్ళే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు ప్రకటించాయి. ప్రధాని మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతికి ప్రపంచబ్యాంకు నిధులు, రైల్వే ప్రాజెక్టులపైన వారితో చర్చించే అవకాశం ఉంది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్ మెంట్ కూడా చంద్రబాబు కోరారు.

వైజాగ్ రైల్వేజోన్ భూమి పూజ ముహుర్తంపై అశ్వినీ వైష్ణవ్ తో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. వరదలపై మరింత కేంద్ర సహాయం పై చర్చించనున్నారు. ఇక విజయవాడ రైల్వే స్టేషన్ విషయంలో చంద్రబాబు చర్చించే అవకాశం కనపడుతోంది. కొత్త రైలు మార్గాలపై దక్షిణ మధ్య రైల్వే చర్చిస్తోంది. దీనిపై చంద్రబాబు కూడా కేంద్ర మంత్రితో చర్చించనున్నారు.

Published : 
  • 3 October 2024, 12:08 PM IST