రెండోసారి ఐసీసీ అవార్డ్ కమిందు అరుదైన రికార్డ్

శ్రీలంక సంచలనం కమిందు మెండిస్‌ చరిత్ర సృష్టించాడు. సెప్టెంబర్‌ నెలకు గాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. తద్వారా ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో రెండుసార్లు ఈ అవార్డ్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

Post Published By: Vencateshg
Updated : 15 October 2024, 1:17 PM IST

శ్రీలంక సంచలనం కమిందు మెండిస్‌ చరిత్ర సృష్టించాడు. సెప్టెంబర్‌ నెలకు గాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. తద్వారా ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో రెండుసార్లు ఈ అవార్డ్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కమిందు ఈ ఏడాది మార్చిలో తొలిసారి ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు అందుకున్నాడు.క కమిందు ఈ అవార్డు కోసం మరో లంక క్రికెటర్ ప్రభాత్‌ జయసూర్య, ఆసీస్‌ హిట్టర్ ట్రవిస్‌ హెడ్‌ నుంచి పోటీ ఎదుర్కొన్నాడు. .కమిందు సెప్టెంబర్‌ నెలలో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌లపై నాలుగు టెస్ట్‌లు ఆడి 90.20 సగటున 451 పరుగులు చేశాడు. కివీస్ పై లంక క్లీన్ స్వీప్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Published : 
  • 15 October 2024, 1:17 PM IST