ఐసీసీ కంటే ఎవరూ ఎక్కువ కాదు… బంగ్లా,పాక్ బోర్డులకు జై షా చురకలు…!

టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు జరిగిన హైడ్రామాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ జై షా ఎట్టకేలకు స్పందించారు. భద్రతా కారణాల నెపంతో టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్.. అలాగే భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ

Post Published By: dialnews
Updated : 16 March 2026, 4:52 PM IST

టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు జరిగిన హైడ్రామాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ జై షా ఎట్టకేలకు స్పందించారు. భద్రతా కారణాల నెపంతో టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్.. అలాగే భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ బెదిరించిన పాకిస్థాన్‌లకు ఆయన పరోక్షంగా చురకలంటించారు. ఏ జట్టూ సంస్థ కంటే పెద్దది కాదని జైషా స్పష్టం చేశారు.ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

భారత్‌లో పర్యటించడానికి భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయంటూ బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఎన్ని హామీలు ఇచ్చినా వారు వెనక్కి తగ్గకపోవడంతో వారి స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంఘీభావంగా పాకిస్థాన్ కూడా తొలుత భారత్‌తో మ్యాచ్ ను బహిష్కరిస్తామని ప్రకటించి ఆ తర్వాత నిర్ణయం మార్చుకుంది.ముంబైలో జరిగిన ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్' కార్యక్రమంలో జై షా ఈ వివాదాలపై స్పందించారు. ఈ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు కొన్ని జట్ల భాగస్వామ్యంపై చాలా చర్చలు జరిగాయనీ, ఏ ఒక్క జట్టూ సంస్థ కంటే పెద్దది కాదన్నారు. ఏ ఒక్క జట్టూ సంస్థను తయారు చేయదన్నారు. అన్ని జట్ల కలయికే ఒక సంస్థని జై షా కుండబద్ధలు కొట్టారు. నేరుగా పేర్లు ఎత్తకపోయినా.. ఆయన కామెంట్స్ పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఉద్దేశించినవేనని స్పష్టమవుతోంది.

వివాదాలు ఎన్ని ఉన్నా ఈ ప్రపంచకప్ వ్యూవర్‌షిప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిందని జై షా కొనియాడారు. ఈ టోర్నీలో ఏకకాలంలో 7.2 మిలియన్ల మంది వీక్షించి రికార్డు సృష్టించారు. పసికూనలు అద్భుత ప్రదర్శన చేశారని.. నెదర్లాండ్స్, జింబాబ్వే, నేపాల్ వంటి జట్లు పెద్ద జట్లకు గట్టి పోటీ ఇచ్చాయని ఆయన అభినందించారు.విజేతగా నిలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు జై షా ఓ కీలక సందేశం ఇచ్చారు. శిఖరం నుంచి కిందకు పడిపోవడానికి కొన్నీ నెలలు చాలనీ , అయితే అట్టడుగు నుంచి పైకి రావడానికి ఏళ్లు పడుతుందన్నారు. కష్టపడి ఆడాలని భవిష్యత్తులో రాబోయే 2030, 2031, 2036 టోర్నీల కోసం ఇప్పటి నుంచే సిద్ధ కావాలని జై షా దిశానిర్ధేశం చేశారు.

Published : 
  • 16 March 2026, 4:52 PM IST