టి20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలు వేదికలుగా ఆరంభం కానుంది. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. భారత జట్టు గ్రూప్ ‘ఎ’లో ఉంది. ఇదే గ్రూప్‌లో పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉంది. గౌతం గంభీర్ కోచ్‌గా మారిన తర్వాత టి20ల్లో టీమిండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు కివీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో భారత జట్టు రెచ్చిపోయి ఆడింది.
అవకాశం దక్కిన ప్రతి ప్లేయర్ కూడా రాణించారు. అయితే ఒక ప్లేయర్ మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాడు. కివీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో సంజూ శాంసన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 5 మ్యాచ్‌ల్లోనూ పూర్తిగా విఫలమై కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. చివరి టి20 తిరువనంతపురంలో జరగడంతో సొంత ఫ్యాన్స్ ముందు సంజూ రెచ్చిపోతాడని అనుకున్నారు. తీరా చూస్తే 6 పరుగులకే వెనుదిరిగాడు. సంజూ ఔటైన ప్రతీ పిచ్ కూడా పూర్తి బ్యాటింగ్ వికెట్లే. అలాంటి పిచ్ లపై వరుస అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక చివరి టీ20లో కీపింగ్ నుంచి కూడా అతన్ని పక్కనపెట్టారు.
అయితే ఇదంతా కూడా సంజూ శాంసన్ చేజేతులా చేసుకున్నదే. కొన్నేళ్లుగా ఆడుతున్నా.. ఎప్పుడూ నిలకడగా ఆడింది లేదు. బాగా ఆడుతున్న సమయంలో టీమ్ మేనేజ్‌మెంట్ పక్కన పెట్టడమో.. అవకాశం ఇచ్చిన సమయంలో సంజూ విఫలం అవ్వడమో జరుగుతూ వస్తున్నాయి. గిల్ కారణంగా సంజూ తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ అవకాశం వచ్చినా దారుణంగా విఫలం అయ్యాడు.
ఒకరకంగా సంజూ శాంసన్ ను దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. టి20 ప్రపంచకప్‌లో మనోడు.. ప్లేయర్లకు డ్రింక్స్, అరటిపళ్లు మోయాల్సిందే తప్ప ఆడేది కష్టమే. టి20 ప్రపంచకప్ తర్వాత సంజూ మళ్లీ టీమిండియాకు ఎంపికయ్యేది కష్టమే. ఇక రెండేళ్ల తర్వాత టీమిండియాకు ఎంపికైన ఇషాన్ కిషన్ మాత్రం కివీస్‌తో జరిగిన టి20 సిరీస్‌ను చక్కగా ఉపయోగించుకున్నాడు. అవకాశం వచ్చిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో రెచ్చిపోయాడు. చివరి టి20లో ఏకంగా శతకం బాదాడు. దాంతో అతడే టి20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా ఆడనున్నాడు.