విక్టరీ వెంకటేష్‌ నెక్స్ట్ లెవల్ డిమాండ్.. పారితోషికం డబుల్.. ఇంత తగ్గేదే లే..!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా విక్టరీ వెంకటేష్ పేరు మారుమోగిపోతోంది. సీనియర్ హీరోల్లో అత్యంత సేఫ్ బెట్ అనిపించుకునే వెంకీ మామ..

Post Published By: dialnews
Updated : 5 February 2026, 3:01 PM IST

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా విక్టరీ వెంకటేష్ పేరు మారుమోగిపోతోంది. సీనియర్ హీరోల్లో అత్యంత సేఫ్ బెట్ అనిపించుకునే వెంకీ మామ.. ఇప్పుడు తన పారితోషికాన్ని భారీగా పెంచి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాడు.
ఇన్నేళ్లుగా ఒక్కో సినిమాకు సుమారు ₹10 కోట్ల నుండి ₹12 కోట్ల రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వెంకీ.. ఇప్పుడు ఏకంగా తన ఫీజును డబుల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుండటంతో.. నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. దాదాపు 65 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా తన మార్కెట్ వాల్యూను పెంచుకోవడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వెంకటేష్ మార్కెట్ ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాధించిన అద్భుత విజయం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు పరుగులు పెట్టించి.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా ₹260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.

ఈ విజయంతో వెంకీ మామ బ్రాండ్ ఇమేజ్ మరోసారి ఫ్యామిలీస్‌లో స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ అయ్యింది. కమర్షియల్ సక్సెస్‌తో పాటు సినిమాకు వస్తున్న లాభాలు చూసి, తన రెమ్యూనరేషన్‌ను పెంచడం సబబే అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం తన సినిమాలే కాకుండా మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారులో వెంకటేష్ చేసిన గెస్ట్ రోల్ ఈ క్రేజ్‌ను రెట్టింపు చేసింది. అందులో ఆయన పోషించిన వెంకీ గౌడ పాత్ర థియేటర్లలో పేల్చిన నవ్వులు, మెగాస్టార్‌తో ఆయన పండించిన కామెడీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ చిన్న పాత్ర కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించడంతో వెంకీ మామ డిమాండ్‌కు ఆకాశమే హద్దు అయింది. తగ్గేదే లే అన్నట్లుగా ఆయన తన తర్వాతి ప్రాజెక్టులకు రేటు ఫిక్స్ చేసేశాడని తెలుస్తుంది.

ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం AK 47 చిత్రం కోసం వెంకటేష్ ఏకంగా ₹23 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది ఆయన గత రెమ్యూనరేషన్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు. అలాగే తన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయబోయే తర్వాతి సినిమాకు సుమారు ₹25 కోట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వెంకటేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ వసూళ్లు ఉంటాయన్న నమ్మకంతో నిర్మాతలు కూడా ఈ భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. మొత్తానికి విక్టరీ వెంకటేష్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. వెబ్ సిరీస్‌ల నుంచి బిగ్ స్క్రీన్ బ్లాక్ బస్టర్స్ వరకు అన్నింటిలోనూ తన ముద్ర వేస్తూ, సీనియర్ హీరోల పారితోషికాల లెక్కలను మార్చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కామెడీని బ్యాలెన్స్ చేయడంలో ఆయనకున్న గ్రిప్పే ఇప్పుడు ఆయన్ని బాక్సాఫీస్ సుల్తాన్‌గా నిలబెడుతోంది. రాబోయే ఆదర్శ కుటుంబం వంటి చిత్రాలతో ఈ జోరు ఇలాగే కొనసాగితే.. వెంకీ మామ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయం.

Published : 
  • 5 February 2026, 3:01 PM IST