పవన్ ఫ్యాన్స్ కి ఏమైంది..? ఉస్తాద్ ఏదో మిస్ అవుతోందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కూడా ఉస్తాద్ భగత్ సింగ్ డైలామాలో పడేసేలా ఉంది. టైమింగ్ అలాంటిది.. సింపుల్ గా చెప్పాలంటే పూర్తిగా రాంగ్ టైమింగ్

Post Published By: dialnews
Updated : 5 February 2026, 7:45 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కూడా ఉస్తాద్ భగత్ సింగ్ డైలామాలో పడేసేలా ఉంది. టైమింగ్ అలాంటిది.. సింపుల్ గా చెప్పాలంటే పూర్తిగా రాంగ్ టైమింగ్... ఒకవైపు తిరుపతి లడ్డు వివాదం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఆ లడ్డు కల్తీ విషయంలో చాలా పెద్ద రచ్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో పవన్ పూర్తిగా సైలెంట్ సిచ్చేవేషన్ ని హ్యాండిల్ చేయటానికి ట్రై చేస్తుంటే, తనని కార్నర్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.. ఇలాంటి టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ అప్ డేట్ నిజంగా రాంగ్ టైమింగేనా..? చాలా ఇబ్బంది కరమైన పరిస్తితుల్లోనే తన సినిమాలు ఎన్నో వచ్చాయి.. భీమ్లానాయక్ లాంటివి హిట్ కూడా అయ్యింది. అలాంటప్పుడు భారీ అంచనాలున్న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ నిజంగా రాంగ్ టైమింగ్ అన్న మాట మాత్రం తూటాలా పేలుతోంది ఎందుకు?తిరుపతి లడ్డు కింద ఉస్తాద్ భగత్ సింగ్ భవిష్యత్తు నలిగేలా ఉందా? ఓజీ రేంజ్ సందడి కష్టమేనా? ఫ్యాన్స్ లో ఊపు తగ్గిందా? వాల్లు వాంటెడ్ గా సైలెన్స్ మేయింటేన్ చేస్తున్నారా?

ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఆ విషయమే ఫిల్మ్ టీం ఎనౌన్స్ చేసింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ సినిమా అంటేనే హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. దీనికి తోడు ఓజీ మూవీతో పవర్ స్టార్ హీ ఈజ్ బ్యాక్ అనిపించేంతగా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. మళ్లీ మార్కెట్ ని కుదిపేశాడు.ఇవన్నీ బానే ఉన్నాయి.. కాని ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకు ఏ అప్ డేట్ చూసినా పవర్ స్టార్ ఫ్యాన్స్ లో సెలబ్రేషన్స్ మిస్ అవుతున్నాయి. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే, వాళ్లు ఇప్పుడు స్లో అయ్యారా? లేదంటే పొలిటికల్ గా తమ అభిమాన నాయకుడికి సపోర్ట్ చేస్తూ, అలానే బిజీ అయిపోయారా? ఏదేమైనా ఉస్తాద్ భగత్ సింగ్ అప్ డేట్ కి సౌండ్ ఉన్నా రీసౌండ్ మిస్ అవుతోంది.

కారణం తిరుపతి లడ్డు అంశమేనా? ప్రజెంట్ ఈ అంశమే రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి నోట్లో నానుతున్న టాపిక్. ఇక ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ ని ఈ అంశమే ప్రజెంట్ శాసించేలా ఉంది. సోషల్ మీడియాల చాలా పెద్ద రచ్చ జరుగుతోంది. బేసిగ్గా పవన్ ఎంత పవర్ స్టార్ అయినా, తనో రాష్ట్రానికి డెప్యూటీ సీఎం. డెఫినెట్ గా తన రాజకీయ ప్రత్యర్దులు, తన మీద బురదచల్లేందుకు ఏ అంశాన్ని వదలరు.తన సినిమాలను కూడా గతంలో ఇలానే కార్నర్ చేశారు. భీమ్లానాయక్ అయితే రిలీజ్ అవటమే కష్టం అన్నారు. కాని బాక్సాపీస్ ని అది షేక్ చేసింది. కాకపోతే ఉస్తాబ్ భగత్ సింగ్ భవిష్యత్తు మాత్రం తిరుపతి లడ్డు కింద నలిగేలా ఉంది. కారణం టైమింగ్.. తిరుపతి లడ్డులో జంతు మాంసం తాలూకు అవశేషాలున్నాయన్న మాటల్ని, కౌైంటర్ చేస్తూ, సిట్ లో అవేవి లేవని తేలాయనే కోణంలో వైసీపీ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.

ఏదినిజమో, సిట్ ఏం చెప్పిదో దాని వల్లొచ్చిన వివాదం అటుంచితే, ఇలాంటి ఒక వివాదం జరుగుతున్న టైంలో ఉస్తాద్ భగత్ అప్ డేట్ ఇవ్వటమే పెద్ద మైనెస్.. దీనికి తోడు ఇది మార్చ్ లో రాబోతోంది. అంటే రెండు నెలల టైం కూడా లేదు. కాబట్టి టీజర్లు, సాంగ్స్, ట్రైలర్ ఏది వచ్చినా అదిప్పుడు ట్రోలింగ్ కి గురవక తప్పదు. పవన్ కూడా ప్రమోషన్ కి టైం కేటాయించే పరిస్తితి లేదు. అలా కేటాయించినా, మీడియా నుంచి తిరుపతి లడ్డు అంశం మీద ప్రశ్నల వర్షం కంటే, ప్రత్యర్ధుల సోసల్ మీడియా ఎటాకే ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ గా రాంగ్ టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవటమే కాదు, దాని అప్ డేట్ కూడా రాంగ్ టైంలోనే వచ్చిందనే మాటే రీసౌండ్ చేస్తోంది.

Published : 
  • 5 February 2026, 7:45 PM IST