టాలీవుడ్ ను గుంజేసిన రోత హీరో.. ఇదేం చిల్లర గోల..?

సినిమాలు.. వాటిలోని పాటలు, డైలాగులు, సీన్లు, డాన్స్ లు, బట్టలు ఇలా ఎన్నో శృతి మించాయి అనే మాట వాస్తవం. సభ్య సమాజం తలెత్తుకోలేని విధంగా సినిమాలు ఉంటున్నాయి అనేది అక్షర సత్యం.

Post Published By: dialnews
Updated : 6 February 2026, 11:35 AM IST

సినిమాలు.. వాటిలోని పాటలు, డైలాగులు, సీన్లు, డాన్స్ లు, బట్టలు ఇలా ఎన్నో శృతి మించాయి అనే మాట వాస్తవం. సభ్య సమాజం తలెత్తుకోలేని విధంగా సినిమాలు ఉంటున్నాయి అనేది అక్షర సత్యం. సినిమా వాళ్ళు డబ్బుల కోసం, ఫేమస్ కావడం కోసం ఎన్నో రోత కార్యక్రమాలు చేస్తూ ఉంటారనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఇప్పుడు ఓ కుర్ర హీరో చేస్తున్న రోత సినిమాలు.. టాలీవుడ్ నే తల దించుకునేలా చేస్తున్నాయి. బరాబర్ ప్రేమిస్తా అనే ఓ సినిమా చేసిన చంద్రహాస్ అనే హీరో పాడిన పాట తీవ్ర విమర్శలకు దారి తీసింది.

సీరియల్ నటుడు ప్రభాకర్ కుమారుడు అయిన చంద్రహాస్.. వేదిక మీద పాడిన పాట.. పరమ రోతగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. గుంజి.. గుంజి.. గుంజి అని పాట పాడుతూ.. బాబు యాటిట్యూడ్ చూపిస్తూ రెచ్చిపోయాడు. ఈ పాటలో ఉపయోగించిన పదజాలం, బూతులపై రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. దీనిని పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ పాటను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అటు జర్నలిస్ట్ లు కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసారు.

దీనిపై అతను రియాక్ట్ అయ్యాడు.. పాటలో వినిపించిన బూతులు ఒరిజినల్ సాంగ్‌ లో లేవని, ఇంపాక్ట్ కోసం తానే సృష్టించానని, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఆ పాటకు ప్రేక్షకుల నుంచి చప్పట్లు వచ్చాయని కూడా చెప్పుకోవడం గమనార్హం. కానీ పరిశీలకులు మాత్రం టాలీవుడ్ ను గుంజి గుంజి గుంజి.. పగలకొట్టాడు అని, ఇలాంటి వాడితో నిర్మాతలు సినిమాలు ఎలా చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. సినిమాలు తీసి అతని తండ్రి డబ్బులు వృధా చేసుకుంటున్నాడు అని మరికొందరు ఫైర్ అవుతున్నారు

సినిమాలు అంటే వినోదం.. సినిమాలు అంటే కాసేపు టైం పాస్.. కాని ఇలాంటి లేకి చేష్టలు, రోత పాటలతో సినిమా పరువు తీయడం మాత్రం బాధాకరమే. సినిమాను ప్రమోట్ చేయడానికి ఎంతకు అయినా దిగజారే కొందరు.. బహిరంగ వేదికలపై మాట్లాడే మాటలు, పాడే పాటలపై ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అక్కడికి ఫ్యాన్స్ రూపంలో జనాలను పిలిచి, చప్పట్లు కొట్టించి, వాళ్ళు మెచ్చుకున్నారు అని చెప్పడం మరింత రోత. దీనిపై టాలీవుడ్ పెద్దలు స్పందించి అతన్ని బహిష్కరించాలి అనే డిమాండ్ లు వినపడుతున్నాయి.

Published : 
  • 6 February 2026, 11:35 AM IST