డైరెక్టర్ ని కాపాడే డ్రాగన్.. ఆవిషయంలో మాస్ దేవుడు…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ మిషన్ ఇప్పుడు ఓన్లీ డ్రాగన్.. అది రెండు భాగాలా? లేదంటే ఒకే భాగం నెక్ట్స్ లెవల్లో తీస్తున్నారు కాబట్టి, ఇంకా ఐదారు నెలలు షూటింగ్ కే టైం పట్టేలా ఉందా తేలాలి..

Post Published By: dialnews
Updated : 10 February 2026, 1:30 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ మిషన్ ఇప్పుడు ఓన్లీ డ్రాగన్.. అది రెండు భాగాలా? లేదంటే ఒకే భాగం నెక్ట్స్ లెవల్లో తీస్తున్నారు కాబట్టి, ఇంకా ఐదారు నెలలు షూటింగ్ కే టైం పట్టేలా ఉందా తేలాలి.. అయితే త్రిబుల్ ఆర్, దేవర తో పాన్ ఇండియా హిట్స్ తర్వాత,వార్ 2 వల్ల జరిగిన నష్టాన్ని డ్రాగన్ తో ప్రశాంత్ నీలే పూడ్చాలన్నారు. కాని ఇక్కడంతా రివర్స్ లో జరుగుతోంది. పాన్ ఇండియా లెవల్లో కేజీయఫ్ తో రెండు భాగాలు, సలార్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ కే ఇప్పుడు అవసరమొచ్చింది. తన ఫేట్ మార్చే బాధ్యత ఎన్టీఆర్ చేతుల్లో ఉంది. ఇప్పుడు తనని ముంచినా తేల్చినా అంతా ఎన్టీఆరే అనంటున్ారు. కేజీయఫ్ 2 తో ఆల్రెడీ 1400 కోట్ల రుచి చూసిన ప్రశాంత్ నీల్ కి 1000 కోట్ల నెంబర్ కలలా మారుతోందనంటున్నారు.. దానర్ధమే షాకింగ్ గా ఉంది. వెయ్యికోట్లకుమించి వసూళ్ళు రాబట్టినోడికి 1000 కోట్లు ఎలా డ్రీమ్ అవుతుంది... అందుకోసం ఎన్టీఆరే ఎలా బాధ్యత తీసుకుంటాడు.. దీని వెనకున్న లాజిక్ మ్యాజిక్ లా మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది.

ఎన్టీఆర్ ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి చాలా పెద్ద హోప్ క్రియేట్ చేస్తున్నాడా? ప్రశాంత్ నీల్ అంటే, సుకుమార్ కంటే ముందే పాన్ ఇండియా లెవల్లో మరో రాజమౌళి అనిపించుకున్న దర్శకుడు. బాహుబలి ట్రెండ్ సెట్ చేస్తున్న టైంలో కేజీయఫ్ తో, రెండు సార్లు పాన్ ఇండియాని షేక్ చేసిన దర్శకుడు. 1400కోట్ల వసూళ్లని రుచి చూడటమే కాదు, సలార్ తో పాన్ ఇండియా హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు.సుకుమార్ అయినా పుష్పరాజ్ రెండు భాగాలతో పాన్ ఇండియాని షేక్ చేశాడు. కాని రాజమౌళి.వరుసగా మూడు పాన్ ఇండియా హిట్లు కొట్టింది ప్రశాంత్ నీలే.. అలాంటి దర్శకుడిని గట్టెక్కించినా, గట్టు దాటించినా ఎన్టీఆరే అనటం రియాలిటీకి కాస్త దూరంగానే అనిపించొచ్చు..కాని అదే నిజం... వాస్తవానికి వార్ 2 విషయంలో ఎన్టీఆర్ హిందీ దర్శక నిర్మాతల చేతిలో మోసపోయాడు.

ఫెల్యూర్ ఫేస్ చేశాడు. అలాంటప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రెజర్ లో ఎన్టీఆర్ ఉండాలి... అది వదిలేసి, ఇప్పడు తనే ప్రశాంత్ నీల్ కి దిక్కనే మాట చాలా విచిత్రంగా తోస్తోంది... కాని అదే నిజం.. అలాంటి పరిస్తితి ఉన్నదనేది వాస్తవం.. ఎందుకంటే వరుసగా పాన్ ఇండియా హిట్లు ఉండటం గొప్ప విషయమే .. కాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నిజానికి సలార్ తో హ్యాట్రిక్ కొట్టడం కాదు, ఫ్లాప్ కొట్టాలి..ఎందుకంటే కేజీయఫ్ కి మరో వర్షన్ సలార్ అనిపించేలానే సినిమా తీశాడన్నారు. అంతా రాజమౌళి సినిమాల ప్రభావం నుంచి బయటికి రాలేకపోతున్న హీరోలు అని అనిపించుకుంటుంతే, ప్రశాంత్ నీల్ మాత్రం తన కేజీయఫ్ నుంచి తానే బయట పడలేని దర్శకుడిగా కామెంట్లు ఫేస్ చేశాడు. సలార్ కథ, కథనాలు, లెక్కకు మించిన పాత్రలు, ఇవన్నీ ప్రశాంత్ నీల్ కేజీయఫ్ లాంటివి తప్ప ఇంకేం తీయలేడా అన్న డౌట్లకు కారణమయ్యాయి

అందుకే ఇప్పుడు దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక పూర్తిగా కేజీయఫ్ స్టైల్ ని కాదు కాని, తన స్టైల్ ని మార్చుకుని కేజీయఫ్, సలార్ ని మించే మూవీ ప్లాన్ చేశాడు. తీస్తున్నాడు.. కాకపోతే ఈ సారి ఎన్టీఆర్ పెర్ఫామెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవే డ్రాగన్ ని కాపాడాలి.. దీనికి తోడు ఎన్టీఆర్ తన లుక్ మార్చుకుంటున్నాడు.రెండు పాత్రలు వేస్తున్నాడు. ఇలా చాలా ప్రయోగాలతో పాటు రిస్క్ కూడా చేస్తున్నాడు. షార్ప్ లుక్స్ తో షాక్ కూడా ఇస్తున్నాడు. అందుకే ఈ సారి ప్రశాంత్ నీల్ ఫేట్ ని మార్చేది ఎన్టీఆరే అన్న మాట రీసౌండ్ చేస్తోంది. ఇలాంటి ఒక చర్చ ఇండస్ట్రీలో పెరిగిపోయింది.

Published : 
  • 10 February 2026, 1:30 PM IST