మెగా ‘ట్విన్స్’ మా పేరు చెప్పుకోండి!

2012లో మెగా దంపతులు రామ్‌ చరణ్‌- ఉపాసన ఏడడుగులతో ఒక్కటవ్వగా, 2023లో వీరికి క్లీంకార జన్మించింది.

Post Published By: dialnews
Updated : 13 February 2026, 3:03 PM IST

2012లో మెగా దంపతులు రామ్‌ చరణ్‌- ఉపాసన ఏడడుగులతో ఒక్కటవ్వగా, 2023లో వీరికి క్లీంకార జన్మించింది. ఇప్పుడు మళ్ళీ ఈ మెగా కపుల్ ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. అయితే వీళ్లకు శివరామ్, అన్వీరా అనే పేర్లను పరిశీలిస్తున్నట్టు మెగా అభిమానుల్లో గుసగుసలు వినబతున్నాయి.

ఆంజనేయ స్వామిని ఆరాధించే రామ్ చరణ్, శివుడు, రాముడు ఇద్దరు దేవుళ్ళకు కలిసేలా శివరాం అని పెట్టబోతున్నాడా అనే ఆనందం మెగా అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మాయికి అమ్మవారి పేరు వినిపించేలా అన్వీరా అని నామకరణం చేయడంలో మెగా కపుల్ తమ ఆనందాన్ని వ్యక్తం చేయబోతున్నారా అనేది తెలియాల్సిఉంది.

https://www.instagram.com/chiranjeevikonidela/p/DUsBqMnibOZ/?hl=en

 

Published : 
  • 13 February 2026, 3:03 PM IST