చిరంజీవికి సర్జరీ.. చేతికి షోల్డర్ బ్యాగ్‌తో మెగాస్టార్.. అంతలోనే మళ్లీ ఏమైంది..?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ లుక్, చేతికి కట్టుతో దర్శనమివ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు శిరీష్ తన మొదటి వెడ్డింగ్ కార్డును చిరంజీవికి అందించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్

Post Published By: dialnews
Updated : 17 February 2026, 11:14 AM IST

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ లుక్, చేతికి కట్టుతో దర్శనమివ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు శిరీష్ తన మొదటి వెడ్డింగ్ కార్డును చిరంజీవికి అందించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఫోటోలో చిరంజీవి ఎడమ చేతికి షోల్డర్ బ్యాగ్ వేసుకుని కనిపించడంతో మెగా అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎప్పుడూ హుషారుగా, ఆరోగ్యంగా కనిపించే తమ అభిమాన నటుడిని ఇలా చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. బాస్ కి ఏమైంది? ఎందుకు చేతికి కట్టు వేసుకున్నారు? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ ఫోటోలో చిరు చిరునవ్వుతో కనిపిస్తున్నప్పటికీ, చేతికి ఉన్న బ్యాగ్ మాత్రం అభిమానుల్లో గుబులు రేపుతోంది. అసలు విషయం ఏంటంటే.. చిరంజీవికి తాజాగా ఎడమ చేతికి సంబంధించిన ఒక చిన్న సర్జరీ జరిగింది. ఇది చాలా మైనర్ సర్జరీ అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.

చాలా రోజులుగా చేతి నొప్పితో బాధ పడుతున్న చిరు.. మన శంకరవరప్రసాద్ గారు తర్వాత ఆ సర్జరీ చేయించుకున్నాడు. చిన్న సమస్య కారణంగా వైద్యుల సూచన మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తన నివాసంలోనే పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. సర్జరీ తర్వాత చెయ్యి కదలకుండా ఉండటానికి, త్వరగా మానడానికి సపోర్ట్ కోసం ఆ షోల్డర్ బ్యాగ్ వాడుతున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు, సినిమాల విషయానికి వస్తే, చిరంజీవి ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రెస్ట్ మోడ్‌లో ఉన్నప్పటికీ, మనసు మాత్రం సినిమాలపైనే ఉంది. త్వరలోనే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరు ఒక భారీ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

సినిమా షూటింగ్ మొదలయ్యే సమయానికి చిరంజీవి పూర్తిగా కోలుకుని, రెట్టింపు ఉత్సాహంతో సెట్స్ పైకి వస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. జూన్ నుంచి సినిమా సెట్స్‌పైకి రానుంది. అల్లు శిరీష్ షేర్ చేసిన ఫోటోలో కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన వాతావరణం కనిపిస్తున్నా, ఫోకస్ మొత్తం చిరు చేతిమీదే ఉంది. గెట్ వెల్ సూన్ బాస్, మీరు త్వరగా కోలుకుని మళ్లీ డాన్సులు వేయాలి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ ఆరోగ్యం పట్ల అభిమానులకు ఉన్న శ్రద్ధ, ప్రేమ ఈ సంఘటనతో మరోసారి రుజువైంది. కేవలం అభిమానులే కాకుండా, సినీ ప్రముఖులు కూడా చిరంజీవి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆయన ఎప్పుడు కోలుకుంటారా, ఎప్పుడు పబ్లిక్ ఈవెంట్లలో కనిపిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు చిరంజీవి. ఎంత శ్రద్ధ వహించినా, గతంలో కొన్నిసార్లు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. 2016లో ఆయన కుడి భుజానికి సర్జరీ జరిగింది. 'ఖైదీ నెం. 150' సినిమా షూటింగ్ సమయంలో భుజం నొప్పి ఇబ్బంది పెట్టడంతో అప్పట్లో ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత కుడి మోకాలికి సంబంధించిన సమస్య తలెత్తడంతో దానికి సంబంధించిన వాష్‌అవుట్ ప్రొసీజర్‌తో చిన్నపాటి సర్జరీ చేయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా అడపాదడపా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా, చిరంజీవి తన విల్ పవర్‌తో, క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో చాలా వేగంగా కోలుకుంటారు. ఇప్పుడు జరిగిన ఎడమ చేతి సర్జరీ నుంచి కూడా ఆయన అంతే వేగంగా కోలుకుని అభిమానులను అలరిస్తారని ఆశిద్దాం.

Published : 
  • 17 February 2026, 11:14 AM IST